Anjali: ఇష్టం లేని వ్యక్తితో అలాంటి సీన్లు… అంజలి షాకింగ్ కామెంట్స్!

Anjali: తెలుగు చిత్రసీమలో పరభాషా హీరోయిన్లకు ఎక్కువ డిమాండ్ అనేది ఓపెన్ సీక్రెటేనని చెప్పొచ్చు. తెల్లతోలు మోజులో మన హీరోలు, దర్శకులు ఉన్నారని, ప్రేక్షకులను కూడా అదే మోజులో ఉంచేసే ప్రయత్నం చేస్తున్నారని సినీ విమర్శకులు ఎన్నోసార్లు పెదవి విరిచిన ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ముంబై నుంచి హీరోయిన్లకు దిగుమతి చేసుకోవడం మనకు పరిపాటిగా మారిందనేది విస్పష్టం.

 

ఈ మధ్య కాలంలో మాత్రం మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన వారిని తమ సినిమాల్లోకి తీసుకునేందుకు టాలీవుడ్ డైరెక్టర్లు, కథానాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే నిత్యా మీనన్, కీర్తి సురేష్ లాంటి వాళ్లు ఇక్కడ స్టార్లుగా మారారు. అదే సమయంలో పూజా హెగ్డే, రష్మిక మందన్న, కృతి శెట్టి లాంటి కన్నడ కస్తూరీలు తెలుగు నాట జెండా పాతేశారు. దీన్ని బట్టి భాష రాకున్నా అందం ఉంటే చాలనే చందంగా సొంత భాషలో కంటే ఇతర పరిశ్రమల వారిని తీసుకునేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది.

 

‘ఆర్సీ 15’లో కీలక పాత్రలో..
ఇకపోతే, తెలుగుమ్మాయి అయినప్పటికీ తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ గా అంజలిని చెప్పొచ్చు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించారీ బ్యూటీ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీబిజీగా మారారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్సీ 15’లో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

 

కెరీర్ తోపాటు పలు ఆసక్తికరమైన విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో అంజలి పంచుకున్నారు. ముద్దుసీన్లు, ఇంటిమేట్ సీన్లలో యాక్ట్ చేయడం గురించి మాట్లాడుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ‘కొన్నిసార్లు క్యారెక్టర్ డిమాండ్ కు తగ్గట్లు కిస్ సీన్స్ లో నటించాల్సి వస్తుంది. మనకు ఇష్టం లేని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ఇబ్బందే. ఇంకొన్ని సార్లయితే ఇంటిమేట్ సీన్లలో యాక్టింగ్ చేసినప్పుడు కారవ్యాన్ లోకి వెళ్లి ఏడ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయినా సరే, సీన్ పండటం కోసం నటించాల్సి వస్తుంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు అంజలి

Related Articles

ట్రేండింగ్

Gedela Srinubabu: టీడీపీలోకి గేదెల శ్రీనుబాబు.. వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ అయితే తప్పదా?

Gedela Srinubabu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది జప్పింగ్ జపాంగ్‌లు పెరిగిపోతున్నారు. అన్ని పార్టీల్లో ఇది కామన్‌గా ఉన్నా.. అధికార వైసీపీ నుంచి ఎక్కువ మంది పార్టీని వీడుతున్నారు. ఆ పార్టీకి...
- Advertisement -
- Advertisement -