Sudha: ప్రముఖ నటి సుధకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా?

Sudha: తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి నటి సుధ. ఆమె తన నటనతో చాలా మంది అభిమానుల మనసును దోచుకుంది. మొదట్లో తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సుధ.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి వందలకొద్ది సినిమాల్లో నటించారు. ఇప్పటివరకు సుధ దాదాపు 835 సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ఆమె నటించి అందరినీ మెప్పించారు. టాలీవుడ్‌లోనే ఆమె 500లకుపైగా సినిమాల్లో నటించడం విశేషం. టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న సుధ.. తల్లి, అత్త, వదిన, చెల్లెలు ఇలాంటి పాత్రల్లో ఎక్కువగా నటిస్తూ ఉంటారు. సినిమాల్లో ఆమె నటనకు మంచి క్రేజ్ ఉంటుంది. కామెడీ టైమింగ్స్ కి, డైలాగ్ డెలివరీలో ఆమెను మించిన వారే లేరు.

 

సినిమాల్లో హీరోలు, హీరోయిన్ల తల్లి, అత్త పాత్రకు డైరెక్టర్లు మొదటగా సుధను మాత్రమే తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చారు. దాంతో ఆమెకు ఆఫర్లు రావడం తగ్గాయి. ఈ క్రమంలో ఆమె పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. పోటీదారులు ఎక్కువగా ఉండటంతో.. కాస్త డౌన్ అయినట్లు కనిపిస్తోంది. తాజాగా నటి సుధ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారని, మొదట్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు సెట్స్ మీద ఓ డ్యాన్స్ మాస్టర్ దారుణంగా అవమానించాడని చెప్పుకొచ్చింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సందర్భంగా నటి సుధ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు తమిళంలో హీరోయిన్‌గా చేశాను. ఓ సినిమాలో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఆ పాటకు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సుందరం మాస్టర్ గురించి నాకు పెద్దగా తెలియదు. నాకు కొన్ని స్టెప్పులు చూపించి.. ఇది ప్రాక్టీస్ చేయమన్నారు. అయితే ఆ స్టెప్పులు చాలా కష్టంగా ఉన్నాయి. స్టెప్పులు పర్‌ఫెక్ట్ గా రాకపోవడంతో చాలా టేక్స్ తీసుకున్నా. దాంతో సుందరం మాస్టర్ నాపై చాలా కోప్పడ్డారు. అందరూ చూస్తుండగానే నువ్వు దేనికి పనికి రావంటూ తిడుతూ వెళ్లిపోయారు. అందరి ముందర తిట్టేసరికి కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను.’ అని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -