Sudigali Sudheer: సుధీర్ కు క్యారెక్టర్ లేదా.. మళ్లీ ఛానెల్ మార్చి పరువు పోగొట్టుకున్నాడుగా?

Sudigali Sudheer: తెలుగు రాష్ట్రాల ప్రజలకు టాలెంటెడ్ గాయ్ సుడిగాలి సుధీర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన సొంత కష్టంతో బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. జబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. అప్పటినుంచి బుల్లితెరపై తన సత్తా చాటుకుని సుధీర్ రష్మితో కలిసి యాంకర్ గా కూడా బుల్లితెరపై తెగ హడావిడి చేశాడు.

అనంతరం తన క్రేజ్ తో వెండితెరపై కూడా అడుగుపెట్టి అరడజన్ సినిమాల్లో నటించి నటుడుగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ గాలోడు, కాలింగ్ సహస్ర అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక జబర్దస్త్ షో తో తన జీవితాన్ని ప్రారంభించిన సుధీర్ దాదాపు 8 సంవత్సరాలు ఆ షో లో హోస్ట్ గా కమెడియను గా హడావిడి చేశాడు. అలా కొద్ది రోజుల తర్వాత ఆ ఛానల్ నుంచి తప్పుకున్నాడు. దీంతో సుడిగాలి సుధీర్ అభిమానులు చాలా వరకు నిరాశకు గురయ్యారు.

ఇక ఆ విధంగా స్టార్ మా షో లో అడుగుపెట్టిన సుడిగాలి సుధీర్ కు అక్కడ స్పెసల్ ఈవెంట్ ద్వారా ఘన స్వాగతం పలికారు. అనంతరం సుధీర్ సూపర్ సింగర్ జూనియర్ షో కి యాంకర్ గా చేశాడు. ఇక సీజన్ గడిచిపోయిన తర్వాత ఇతడు బుల్లితెరపై మళ్ళీ కనిపించలేదు. దీంతో ఇతడు మళ్లీ జబర్దస్త్ షో కు రీ ఎంట్రీ ఇస్తాడని వార్తలు బాగా నడిచాయి. కానీ ఈ విషయం గురించి సుధీర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే సుధీర్ ఇప్పుడు జీ తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు.

ఆ ఛానల్ లో దసరా పండగకు సందర్భంగా నిర్వహిస్తున్న జీ కుటుంబం అవార్డ్స్- కిరాక్ పార్టీ అనే ఈవెంట్ కు ఇతడు హోస్టుగా చేయబోతున్నాడు. సుధీర్ తో పాటు ఇందులో హాట్ యాంకర్ శ్రీముఖి కూడా సందడి చేస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అయితే సుధీర్ ను ప్రస్తుతం నెట్టింట్లో ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. సుధీర్ కి క్యారెక్టర్ లేదు.. ఒక ఛానల్ లో స్థిరంగా ఉండడం లేదు. ఒక ఛానల్లో తిన్నగా ఉండకుండా క్యారెక్టర్ లేనివాడిగా పరువు తీసుకుంటున్నాడు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -