Sudigali Sudheer: త్వరలోనే జబర్దస్త్ లోకి సుధీర్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన గెటప్ శ్రీను?

Sudigali Sudheer: తెలుగు రాష్ట్రాల ప్రజలకు మల్టీ టాలెంటెడ్ గా సుడిగాలి సుధీర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా సుధీర్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యాడు. ఆ షోలో తన ప్రత్యేకమైన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు సుధీర్. అలా ఈటీవీ షోలలో యాంకర్ స్థాయికి ఎదిగాడు ఇతడు. అంతే కాకుండా ఇతడు తెలుగు రాష్ట్రాల ప్రజలతో మంచి ర్యాపో సంపాదించుకున్నాడు.

అనంతరం వెండి తెర పై కూడా అడుగుపెట్టి పలు సినిమాలో హీరోగా నటించాడు. అయినప్పటికీ ఈ సినిమాలో సుధీర్ కి అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ ఈటీవీ షోను వదిలి వేరే ఛానల్స్ లో హడావిడి చేస్తున్నాడు. జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడం తన అభిమానులు తీసుకోలేకపోయారు. అంతేకాదు చాలామంది అన్నం పెట్టిన జబర్దస్త్ షో ను విడిచి వెళ్లడం కరెక్ట్ కాదని ఆయన పై విమర్శలు కూడా చేసారు.

ఇదిలా ఉంటే సుధీర్ గురించి గెటప్ శ్రీను ఒక ఆసక్తికరమైన విషయం బయట పెట్టాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీను సుధీర్ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇస్తున్నాడా.. అన్న విషయంపై స్పందించాడు. ఆ ఇంటర్వ్యూలో సుధీర్ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తాడు అని ఒక చిన్న హింట్ ఇచ్చాడు. ఇక సుధీర్ కుర్చీ ఎప్పటికీ అలాగే ఉంటుందని.. తన రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉంటామని గెటప్ శ్రీను ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

మరి జబర్దస్త్ షో తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న సుధీర్ అనంతరం వెండి తెరపై అడుగుపెట్టి పలు సినిమాలో హీరోగా నటించాడు. కానీ ఈ సినిమాలో సుధీర్ కి అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయాయి. దాంతో సుధీర్ మళ్లీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇక గెటప్ శ్రీను చెప్పిన మాటలతో సుధీర్ మళ్లీ జబర్దస్త్ షో కి వస్తాడని అందరు నమ్ముతున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -