Sukanya Samriddhi: ఇలా చేసి దీపావళికి ఆడ పిల్లలకు రూ. 65 లక్షల గిఫ్ట్‌ ఇవ్వండి!

Sukanya Samriddhi: ఆడ పిల్లల భవిష్యత్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్చాలనుకుంటే.. ఈ దిపావళికి వారికి ప్రత్యేకమైన బహుమతి ఇవ్వండి. ‘సుకన్య సంవృద్ధి యోజన’ అనే అద్భుతమైన పథకాన్ని ప్రభుతం ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో మీ ఆడపిల్లల పేరుతో తెరవడం ద్వారా వారికి 21 ఏళ్లు వచ్చేసరికి వారిని లక్షాధికారులను చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2015లో ప్రారంభించింది. ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న పొదుపు పథకాన్ని అందిస్తుంది.

బేటీ బచావో–బేటీ పడావో అనే స్కీమ్‌లో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన ను తీసుకొచ్చింది. ఈ పథకం కేవలం మెరుగైన రిటర్నులను అందించడమే కాకుండా.. ఆడపిల్లల ఉన్నత చదువులకు, పెళ్లిళ్లకు, కెరీర్‌కు ఈ పథకం ఆర్థిక భరోసాను అందిస్తుంది. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను పదేళ్ల లోపున్న ఆడపిల్లల పేరుతో తెరవవచ్చు.

తద్వారా ఆడ పిల్లలకు భవిష్యత్‌ భద్రంగా ఉంటుంది. వారు పుట్టినప్పుడు నుంచే వారిని ఆ పథకంలో చేర్పిస్తే.. వారికి పెళ్లిడు వచ్చే వరకు ఎలాంటి బెంగ లేకుండా వారి పెళ్లిని వారు జమా చేసిన డబ్బులతోనే హాయిగా చేయొచ్చు. ప్రభుత్వం కూడా ఈ పథకంపై వివిధ రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ.. ఆడ పిల్లలను ఈ పథకంలో చేర్పిస్తున్నారు. చాలా మంది ఆడ పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ పథకం పై ఆసక్తి చూపి తమ పిల్లల భవిష్యత్‌ గురించి ఈ పథకంలో చేర్పిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Namrata Shirodkar: రోజురోజుకూ మహేష్ భార్య చిన్నపిల్లవుతోంది.. 50 ఏళ్ల వయస్సులో ఇదేం అందమంటూ?

Namrata Shirodkar:  మనకు వయసు పైబడే కొద్ది మన అందం కూడా తగ్గుతుందని చెప్పాలి. ఇలా వయసు పైబడిన కొద్ది అందం కాపాడటం కోసం సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు కానీ...
- Advertisement -
- Advertisement -