Suma: తన యాంకరింగ్ కెరీర్ కు బ్రేక్ వేయబోతున్న సుమ!

Suma: బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ట్రేడ్ మార్క్ సృష్టించుకున్న వ్యక్తి సుమ. ఆడియో లాంచ్ దగ్గర నుంచి బుల్లితెరపై జరిగే ఏ చిన్న కార్యక్రమమైనా సుమక్క లేకుండా జరిగితే వెలవెలబోతుందని చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ ఎవరు అంటే ఏకపక్షంగా వినిపించే ఒకే ఒక పేరు సుమక్క.

గత పది పదిహేను సంవత్సరాల నుంచి టీవీ యాంకర్ గా నిర్విరామంగా సుమ చేస్తున్నారు. ఆమె ఎంటర్టైన్మెంట్ ఎంత అద్భుతంగా ఉంది అనేదానికి ఇంతకు మించిన నిదర్శనం అవసరం లేదు. దినదినం పోటీ పెరుగుతున్నప్పటికీ బుల్లితెరపై ఇప్పటివరకు సుమక్కకు పోటీగా నిలబడే యాంకర్ మరొకరు లేరు అని చెప్పొచ్చు.
తనదైన వినూత్నమైన కామెడీతో పంచ్ డైలాగ్స్ తో సుమా ఏ షోనైనా రక్తి కట్టిస్తుంది. అంత పవర్ఫుల్ యాంకర్ అయిన సుమ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ ఒకటి వెల్లడించారు.

అసలు వివరాల్లోకి వెళ్తే కేరళ నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుమ కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాతో నటిగా మారింది. ఆమెకు నటిగా పెద్ద పేరు రాకపోయినప్పటికీ బుల్లితెర యాంకర్ గా మాత్రం నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించగలిగింది. రియాలిటీ షో దగ్గర నుంచి మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వరకు సుమక్క హవా లేకుండా జరిగే ప్రసక్తే లేదు.

తెలుగు చానల్స్ అన్నిటిలోకి సుమకు ఎక్కువ అనుబంధం ఉన్నది ఈటీవీ తో. స్టార్ మహిళ అనే ఒక ప్రోగ్రాం లో ఆమె 4 వేల ఎపిసోడ్లు చేసింది అంటే ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అర్థం చేసుకోండి. ప్రస్తుతం రేపు న్యూ ఇయర్ కి ఈటీవీలో రాబోతున్న“వేరే ఈజ్ ద పార్టీ” షో కి కూడా సుమ హోస్టుగా వ్యవహరించనున్నారు. ఈ ప్రోగ్రాం లో భాగంగా సుమను సన్మానించడం జరిగింది. తన యాంకరింగ్ కెరీర్ ని గుర్తు చేసుకున్న సుమ తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రస్తుతం కొంత కాలం తను యాంకరింగ్ నుంచి విరామం తీసుకోవాలి అనుకుంటున్నట్లు సుమ చూచాయిగా చెప్పింది. సుమక్క ఏంటి యాంకరింగ్ కి బ్రేక్ ఇవ్వడం ఏంటి అని అభిమానులు షాక్ అవుతున్నారు. మరికొందరు ఇదేదో ప్రాంక్ లో భాగమై ఉంటుంది అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి సుమ చేసిన వ్యాఖ్యలు నిజమా లేక ప్రాంకా అనేది మాత్రం తెలియాలి అంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -