Suma: 47 ఏళ్ల వయస్సులో సుమకు లవ్ ప్రపోజల్.. ఏమైందంటే?

Suma: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. కామెడీ టైమింగ్‌, పంచ్ పవర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌లో ఆమెకు ఎవరూ పోటీ రారు. స్టార్ కమెడియన్లే ఆమె దెబ్బకు నోరేళ్లబెట్టుకుంటారు. సుమ యాంకరింగ్ చేస్తుందంటే.. ఆ షో టీఆర్‌పీ రేటింగ్ రేసుగుర్రంలా దూసుకెళ్తుంది. ప్రస్తుతం సుమ.. మల్లెమాల సమర్పణలోని ‘క్యాష్- దొరికినంత దోచుకో’ ప్రోగ్రామ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సెలబ్రిటీలను గెస్టులగా తీసుకొచ్చి.. వారితో గేమ్ ఆడించడమే ఈ షో కాన్సెప్ట్. తాజాగా క్యాష్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో కమెడియన్లు ప్రభాస్ శ్రీను, హేమ, హరితేజ, ప్రవీణ్ ముఖ్యఅతిథులుగా వచ్చారు. ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్‌గా షో ముందుకు సాగుతుంది. ప్రభాస్ శ్రీను కామెడీ పంచులు అదిరిపోయాయి. మిగిలిన కమెడియన్లు కూడా ఏ మాత్రం తగ్గకుండా పంచులు వేశారు.

 

ప్రోమోలో భాగంగా.. ‘క్యాష్ ఫిల్మ్ స్కూల్’ కాన్సెప్ట్ తో ఓ ఆటను ఆడారు. ఈ ఆటలో సుమ గెస్టులకు ఇచ్చే టాస్క్ చేయాల్సి ఉంటుంది. ముఖంలో హావాభావాలు పలకరించాలని సుమ చెప్పడంతో హరితేజ రకరకాలుగా ఏడుస్తూ టాస్క్ పూర్తి చేసింది. అలాగే షోకి వచ్చిన ఓ ఆడియన్స్‌ తో హరితేజ ఈ టాస్క్ చేయించింది. అదీ నవ్వులు పూయించింది. దీని తర్వాత ప్రవీణ్‌కి లవ్ ప్రపోజ్ టాస్క్ ను ఇచ్చింది సుమ. పార్కులో నిల్చున్న అమ్మాయి దగ్గరికి వెళ్లి ‘ఐ లవ్ యూ’ అని చెప్పాలని చెబుతుంది. దాంతో ప్రవీణ్ ఈ టాస్క్ ఓ అబ్బాయికి చెప్పి చేయిస్తాడు. సుమను లవర్‌గా భావించి ప్రపోజ్ చేయమంటాడు. దానికి ఆ అబ్బాయి సుమ దగ్గరికి వెళ్లి.. ‘మిమ్మల్నీ చాలా రోజులుగా ఫాలొ అవుతున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ.’ అని చెప్తాడు. దానికి సుమ.. ‘నువ్వు మా అబ్బాయి క్లాస్‌మేట్ కదా..’ అని సమాధానం చెబుతుంది. దాంతో షోలో ఉన్నవారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. కాగా, ప్రోమో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉందని.. ఎపిసోడ్ మరింత నవ్వులు పూయించడం ఖాయమని నెటిజన్లు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -