Suman: సుమన్ పైన నాపైన అలాంటి వీడియోలు క్రియేట్ చేశారు!

Suman: సినిమా ఇండస్ట్రీకి చెందిన వారి మీద నిత్యం ఏవో పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. పలానా హీరో, పలానా హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నాడట, ప్రేమించుకుంటున్నారట, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారట.. ఇలా ఏవేవో వార్తలు ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అయితే కొంతమంది నటులకు సంబంధించిన పుకార్లు షాకింగ్ గా ఉంటాయి.

కొంతమంది నటులకు యాక్సిడెంట్ జరిగిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రాణాలతో పోరాడుతున్నారని, కొన్నిసార్లు మరణించినట్లు కూడా వార్తలు వస్తుంటాయి. చాలా వరకు ఇలాంటి పుకార్లు యూట్యూబ్ ఛానల్స్ వల్ల వ్యాపిస్తుంటాయి. అయితే ఇలాంటి ఘటనే తనకు కూడా జరిగిందని సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంధ్య వివరించింది.

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంతో పాటు సినిమా లైఫ్ గురించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంధ్య తెలిపింది. తెలుగులో మంచి గుర్తింపు సాధించినందుకు ఆనందంగా ఉందని, తమిళంలో కూడా అవకాశాలు వచ్చినా భాష రాని కారణంగా సినిమాలు వదులుకున్నట్లు సంధ్య వివరించింది. తెలుగులో అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి వీలవుతుందని కూడా ఆమె తెలిపింది.

ఇక తాను మరణించినట్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేసినట్లు సంధ్య వివరించింది. బహుశా వారు వ్యూస్ కోసం, ఆదాయం కోసం అలా చేసి ఉంటారని తాను అనుకుంటున్నట్లు సంధ్య పేర్కొంది. తనతో పాటు హీరో సుమన్ విషయంలో కూడా ఇలా జరిగినట్లు ఆమె తెలిపింది. బహుశా ఇలాంటి వార్తలు, వీడియోల వల్లే తనకు అవకాశాలు కూడా తగ్గి ఉండవచ్చని కూడా సంధ్య అభిప్రాయపడింది.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -