Suman Shetty: పవన్ గొప్పదనం చెప్పిన సుమన్ శెట్టి.. ఏమన్నారంటే?

Suman Shetty: తేజ డైరెక్షన్ లో రిలీజ్ అయిన జయం సినిమాతో తన సినీ కెరీర్ ను మొదలుపెట్టిన కామెడీ యాక్టర్ సుమన్ శెట్టి గురించి అందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించిన సుమన్ తనదైన కామెడీ స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతను జయం,7G బృందావన్ కాలనీ,ధైర్యం,అన్నవరం వంటి సినిమాలలో నటించాడు.

 

రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సుమన్ శెట్టి పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు మరియు వెంకటేష్ తన ఫేవరెట్ స్టార్స్ అని చెప్పాడు. ఈ సందర్భంగా అన్నవరం షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి ప్రస్తావించి సుమన్ శెట్టి ఎమోషనల్ అయ్యారు.

 

సుమన్ శెట్టి దాదాపు 10 ఏళ్ల పాటు మంచి కమీడియన్ గా గుర్తింపు పొందాడు. అతను సుమారు 100 సినిమాలకు పైగా నటించాడు. అతను చివరిసారిగా నటించిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఆ తరువాత తిరిగి అతను మరి ఏ సినిమాలోని ఇంతవరకు కనిపించలేదు.

 

అన్నవరం షూటింగ్స్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను సుమన్ శెట్టి సెట్ లో కలిశాడు. సుమన్ శెట్టి ని చూసిన పవన్ సుమన్ నీ యాక్షన్ బాగుంటుంది, నేను నీ జయం మూవీ చూశాను అని మెచ్చుకున్నారట. అసలే పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన సుమన్ శెట్టి తన ఆరాధ్య నటుడు తన నటన గురించి మెచ్చుకోవడంతో తెగ సంబరపడ్డాడు. తను ఎంతో ఇష్టపడే యాక్టర్ తన గురించి గొప్పగా మాట్లాడడంతో అతనికి ఆనందంతో నోటి మాట రాలేదట. అన్నవరం తర్వాత ఎన్నో సంవత్సరాలకు రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ లో ఒక క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్ స్వయంగా సుమన్ ను సిఫార్సు చేశారట. అంతేకాకుండా నువ్వు మంచి యాక్టర్ వి కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు బాగా ఫిట్ అవ్వు నీకు మంచి భవిష్యత్తు ఉంది అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో తన కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ కు అతని తో కలిసి పనిచేసిన ప్రతి ఒకరితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఎటువంటి కల్మషం లేకుండా అందరితో కలిసి మెలిసి ఉండే అద్భుతమైన నటుడు పవన్ కళ్యాణ్ అనేదానికి నిదర్శనంగా అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వస్తూ ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnamraju: రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా.. ఏ దిక్కు లేకపోతే అ పార్టీనే దిక్కవుతుందా?

Raghurama Krishnamraju: ఏపీలో రఘురామకృష్ణం రాజు ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నారు. నిజానికి గత నాలుగేళ్లు ఏపీ రాజకీయాల్లో ఆయన ట్రెండ్ అవుతూనే ఉన్నారు. వైసీపీ ఎంపీల పేర్లు గుర్తు...
- Advertisement -
- Advertisement -