Suman: ఆ హీరో వల్లే సుమన్ కు ఇలాంటి కష్టాలు ఎదురయ్యాయా?

Suman: టాలీవుడ్‌లో హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరాటే, బ్లాక్ బెల్ట్‌లో రాణించిన సుమన్ ఎంతో కష్టపడి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఒకదశలో ఇండస్ట్రీలో అతడు స్టార్ హీరోలతో కలిసి పోటీ పడేవాడు. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో సమానంగా సుమన్ సినిమాలకు వసూళ్లు వచ్చేవి. దీంతో సుమన్ డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు పోటీలు పడేవాళ్లు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 150 సినిమాలకు పైగా హీరోగా సుమన్ నటించాడు.

బావ బావ మరిది, పరువు ప్రతిష్ట, నాయుడు గారి కుటుంబం, రెండిళ్ల పూజారి వంటి సినిమాలతో సుమన్ ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోగా ఎదుగుతున్న స‌మ‌యంలో సుమ‌న్ ఇంటిపై పోలీసుల రైడ్ జ‌రిగింది. ఆ కేసు వ‌ల్ల సుమ‌న్ జైలు పాలయ్యాడు. అమ్మాయిలను వేధించి నీలిచిత్రాలు తీశాడని సుమన్‌పై అభియోగాలు నమోదయ్యాయి. అయితే తనను ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలియదని సుమన్ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఆధారాలు అడిగితే విచారణ జరుగుతోందన్న సాకుతో పోలీసులు తప్పించుకునేవారు అని వివరించాడు.

1985 తన జీవితంలో మరిచిపోలేని సంవత్సరం అని.. తన జీవితంలో ఊహించని ఘటనలు ఆ ఏడాది జరిగాయని సుమన్ తెలిపాడు. హైదరాబాద్‌లో తనను అరెస్ట్ చేసిన పోలీసులు సైదాబాద్ కోర్టులో హాజరుపరిచారని.. ఆ తర్వాత మద్రాస్ జైలుకు పంపించారని సుమన్ చెప్పాడు. తనను సాధార‌ణ ఖైదులు ఉండే గ‌దులు కాకుండా అత్యంత ప్ర‌మాద‌క‌ర టెర్ర‌రిస్టులు ఉండే గ‌దుల్లో వేశార‌ని కన్నీటి పర్యంతమయ్యాడు. జైలులో త‌న‌కు తానే ధైర్యం చెప్పుకునేవాడినని.. కరుణానిధి గారు జైలు అధికారులను హెచ్చరించి వేరే గ‌దికి మార్పించార‌ని వివరించాడు. 5నెలల తర్వాత జైలు నుంచి బెయిల్‌పై విడుదలైనట్లు వెల్లడించాడు.

సుమన్‌ను ఇరికించింది ఆ స్టార్ హీరోనేనా?
తనపై ఓ స్టార్ హీరో చేసిన కుట్ర వల్లే తాను జైలు జీవితం గడపాల్సి వచ్చిందని సుమన్ ఆరోపణలు చేశాడు. హీరోయిన్‌లు సుహాసిని, సుమలత తప్ప తనను ఎవరూ పట్టించుకోలేదని తెలిపాడు. అయితే సుమన్ చెప్పిన స్టార్ హీరో ఎవరు అంటూ అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కొందరు మెగాస్టార్ అని మరికొందరు సూపర్‌స్టార్ అని ఎవరికి తోచింది వారు అనుకున్నారు. ఏది ఏమైనా హీరోగా సుమన్ కెరీర్ ఆశించిన విధంగా సాగలేదు. చివరకు అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది. కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా మునుపటి క్రేజ్‌ మాత్రం సొంతం కాలేదు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -