Suman: వైరల్ అవుతున్న సుమన్ సంచలన వ్యాఖ్యలు!

Suman: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో సీనియర్ నటుడు సుమన్ ఒకరు.ఈయన ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. అయితే కొన్ని కారణాలవల్ల సుమన్ సినిమాలను పూర్తిగా తగ్గించారు.ఇలా సుమన్ కి అవకాశాలు రాకపోవడం వెనుక మెగాస్టార్ ప్రమేయం ఉందంటూ పలు వార్తలు వచ్చాయి. అలాగే వీరిద్దరికి మనస్పర్ధలు కూడా ఉన్నాయని వార్తలు వినిపించాయి.

 

ఇలా వీరిద్దరి గురించి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు సుమన్ ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించారు. ఇకపోతే వీరిమధ్య ఇలాంటి గొడవలు మనస్పర్ధలు ఉన్నట్లు కూడా ఎప్పుడు ప్రవర్తించలేదు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటుడు సుమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తాను ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా చెబుతున్నాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎక్కడికి వెళ్లినా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ కు దక్కిన అదృష్టం.

ఇక మన జీవితంలో మనం ఏది కావాలి అనేది ముందుగానే దేవుడు రాసిపెట్టి ఉంటాడని ఈయన తెలిపారు. అది సినిమా అయినా.. వ్యాపారమైన.. రాజకీయమైనా.మనమందరం కూడా దేవుడి చేతిలో యాక్టర్లమే నేను చేసే పనులను మీరు చేయలేరు మీరు చేసే పనులను నేను చేయలేను. అయితే ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందని సుమన్ తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ జీవితంలో సీఎం అవ్వాలని దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు. ఆయన తప్పకుండా సీఎం అవుతారని సుమన్ వెల్లడించారు.

 

ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కనుక ఆయన తప్పనిసరిగా సీఎం అవుతారని ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన పలువరు నటీనటులు ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే సుమన్ సైతం పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని దేవుడు రాసి పెట్టాడు అంటూ చెప్పడంతో చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మరి అందరూ అనుకున్నట్టుగానే ఈసారి పవన్ కళ్యాణ్ ఏపీలో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -