Sunil Diyodor: ఏపీలో టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన జాతీయ నేత

Sunil Diyodor:  ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు నేతలు దాదాపు ఐదేళ్ల తర్వాత కలవడం, జగన్ కు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్న అంశంపై కలిసి పనిచేస్తామంటూ ప్రకటించారు. మరో 10 సార్లు అయినా కలుస్తామని, జగన్ ప్రభుత్వంపై పోరాటం చేయడంపై చర్చించుకుంటామని తెలిపారు. ఇతర పార్టీలను కూడా కలుపుకుని జగన్ తీరును ప్రజల్లో ఎండగడతామంటూ చెప్పుకొచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసే కలిసి పోటీ చేయడం ఖాయమనే చర్చ జరుగుతోంది. జగన్ పై కలిసి పోరాటం చేయడమే కాకుండా ఎన్నికల్లో పొత్తు పెట్టాకుంటారనే టాక్ నడుస్తోంది.

అయితే బీజేపీలో కూడా టీడీపీ, జనసేన కూటమిలో చేరుతుందంటూ ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో బయట జరుగతున్న ప్రచారంపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోధర్ స్పందించారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటూ చెప్పుకొచ్చారు. గతంలో ఒకసారి పొత్తు పెట్టుకుని చేదు అనుభవాలను చవిచూశామని, మరోసారి పొత్తు పెట్టుకునే అవకాశం లేదని చెప్పుకొచ్చారు. వైసీపీ, టీడీపీ రెండు అవినీతి పార్టీలని, కుటుంబ పార్టీలంటూ సునీల్ ధియోధర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. వైసీపీ, టీపీపీలు ప్రత్యామ్నాయంగా బీజేపీ,జనసేన కూటిమిని ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు.

ఇక మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వదిలి ఇతర పార్టీలలోకి జంప్ అవుతారనే ప్రచారంపై సునీల్ ధియోధర్ స్పందించారు. ఆయన పార్టీ మార్పు వార్తలపై స్పందించడానికి ఆయన ఇష్టపడలేదు. కన్నా లక్ష్మినారాయణ పార్టీ మార్పును బీజేపీ లైట్ గానే తీసుకున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది. ఆయన పార్టీ మారినంత మాత్రాన తమకు వచ్చే నస్టమేమీ లేదనే తీరులో ఏపీ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కన్నా పార్టీ మారతారనే వార్తలను లైట్ తీసుకకున్నారు. ఆయన పార్టీ మార్పుపై తాను స్పందించనని, ఆయన ఇష్టం అంటూ వదిలేశారు. ఇప్పుడు సునీల్ ధియోధర్ కూడా లైట్ తీసుకోవడంతో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మార్పును ఏపీ బీజేపీ సీరియస్ గా తీసుకోవడం లేదని చెబుతున్నారు.

సోము వీర్రాజుపై కన్నా లక్ష్మినారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీని ఆయన నాశనం చేస్తున్నారంటూ విమర్శించారు. పార్టీలోని ఇతర నేతలను పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. దీంతో బీజేపీలో ఆయన ఇమడలేక పోతున్నారని, త్వరలోనే ఆ పార్టీని వీడటం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. కన్నా లక్ష్మీనారాణ టీడీపీలో చేరే అవకాశముందని చబుతున్నారు. గతంలో ఆయన వైసీపీలో చేరేందుకకు సిద్దమయ్యారు. 2019 ఎన్నికలకు ముందు కన్నా వైసీపీలో చేరేందుకకు సద్దమయ్యారు. ఈ మేరకు గుంటూరులో ఆయన వైసీపీలో చేరుతన్నట్లు ఫ్లెక్సీలో వెలిశాయి. కానీ అప్పటికప్పుడు అమిత్ షా నుంచి ఫోన్ రావడం, గుండెనొప్పి అంటూ ఆయన ఆస్పత్రిలో చేరడం, వెంటనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఆయను నియమించడం నాటకీయ పరిణామాల మధ్య చోటుేసుకుంది.

ఆ తర్వాత ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొద్దికాలం కన్నా లక్ష్మినారాయణ పనిచేశారు. ఆ తర్వాత కన్నా లక్ష్మినారాయణను తొలగించి సోము వీర్రాజుకు అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.కానీ కన్నా లక్ష్మినారాయణ సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తు్నాయి. అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత కన్నాకు పార్టీలో ఎలాంటి పదవులు ఇవ్వలేదు. దీంతో సామాన్య నేతగానే ఆయన కొనసాగుతున్నారు. దీంతో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో వచ్చే ఎన్నికల లోపు ఏదోక పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కన్నా లక్ష్మినారాయణ భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -