Sunil Entry: తెలంగాణ రాష్ట్రంలో సునీల్ ఎంట్రీ.. సీఎం కేసీఆర్ కు చుక్కలేనా?

Sunil Entry: సునీల్ కొనుగోలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద అసెట్ గా మారిపోయాడు. తన వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించేస్తున్నాడు ఈ మధ్యనే కర్ణాటకలో కూడా తన స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఇటీవలే ఆయనని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది కర్ణాటక ప్రభుత్వం అయితే ఇప్పుడు సునీల్ తెలంగాణలో కూడా ఎంట్రీ ఇస్తున్నారా అన్న చర్చ నడుస్తోంది.

అదే జరిగితే సీఎం కేసీఆర్ కి భారీ షాక్ తప్పదు. తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు సునీల్ కొనుగోలు. చత్తీస్గడ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలకు కొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి అక్కడ కూడా ఈయన బాధ్యతలు చూడనున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ తెలంగాణలోని పరిస్థితిలే హై కమాండ్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 

రేవంత్ రెడ్డి వైఖరి పై సముఖంగా లేని పలువురు సీనియర్ నేతలను ఏకతాటిపై తీసుకు రాగలరా.. నేతల మధ్య అంతర్గత విభేదాలను పరిష్కరించడం అంత సులువేనా.. అన్న టాక్ మొదలైంది. కర్ణాటకలో మాదిరిగా అవినీతి ఆస్త్రాన్ని ఎక్కడ కూడా అమలు చేస్తారా అనేది చూడాలి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే లాగా కనుగోలు వ్యూహాలు ఉండొచ్చు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఒకవేళ సునీల్ ఎంట్రీ జరిగితే కనుక సీఎం కేసీఆర్ కి చుక్కలేనా.. అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ నేతల మధ్య సయోధ్య అనేది పెద్ద సవాల్. మరి ఈ నేతలందరినీ సునీల్ కొనుగోలు ఏకతాటిపైకి తీసుకు రాగలరా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్న చర్చ. మొత్తానికి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న వ్యూహకర్తగా పేరుపొందిన సునీల్ కొనుగోలు పార్టీని గెలిపించడానికి ఎలాంటి వ్యూహాలని అమలు చేస్తారనేది వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -