Sunisith: మంచు విష్ణుపై సునిశిత్ షాకింగ్ పోస్ట్ వైరల్!

Sunisith: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మోహన్ బాబు తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో మంచి విష్ణు హీరోగా పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. కాగా విష్ణు సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులర్ అయ్యాడని చెప్పవచ్చు. మా ఎలక్షన్స్ సమయంలో అయితే మంచు విష్ణు ఎక్కువగా వార్తలో నిలచడంతో పాటు ట్రోలింగ్స్ ని సైతం ఎదుర్కొన్నాడు.

 

తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు మంచు విష్ణు. అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా వీడియోలను ట్వీట్ లను చేస్తూ ట్రోల్స్ బారిన పడుతూ ఉంటారు విష్ణు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విష్ణు మా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే మా ప్రెసిడెంట్ అయ్యాడు అన్న మాటే కానీ ఆ తర్వాత ఆ విషయాల్లో మా అసోసియేషన్ కి సంబంధించి ఎటువంటి విషయాల్లో మంచు విష్ణు పేరు ఇప్పటివరకు వినిపించలేదు.

ఎక్కువగా కాంట్రవర్సీ విషయాల్లో నిలుస్తున్నాడే తప్ప ఒక మంచి విషయంలో కూడా మంచు విష్ణు వార్తలు నిలవడం లేదు. దానికి తోడు తాజాగా మంచు మనోజ్ షేర్ చేసిన వీడియోతో మంచు విష్ణు పై భారీగా ట్రోలింగ్స్ జరగడంతో పాటు నెగెటివిటీ ఏర్పడింది. ఆ వీడియోలు విష్ణు మంచు మనోజ్ ని అతనికి సన్నిహితంగా ఉండే వ్యక్తులను కొట్టడానికి వెళ్ళగా ఇద్దరు వ్యక్తులు ఆపుతున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఇంటికి వచ్చి మా వాళ్ళని మా బంధువులను ఇలా ఇష్టం వచ్చినట్లు కొడుతుంటారు అని మంచు మనోజ్ వాయిస్ కూడా అందులో వినిపిస్తోంది.

 

ఈ వీడియో పై ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించడంతోపాటు నెటిజన్స్ మంచు విష్ణుని దారుణంగా ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వీడియో పై హీరో సునిశిత్ స్పందించారు. మంచు విష్ణు గొడవ పడుతున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఏరా విష్ణుగా ఇంక నువ్వు మారవా.. అర డజను మంది పిల్లలకు తండ్రివి రా నువ్వు.. అప్పుడు నా సినిమాలు లాక్కున్నావు.. ఇప్పుడు మనోజ్ ని కొట్టడానికి వెళ్తున్నావు.. నెక్స్ట్ మా ప్రెసిడెంట్ గా పాల్గొని నేను కచ్చితంగా ఓడిస్తాను అని ట్విట్ చేశాడు.. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -