Sunitha: సునీత పోటీ అక్కడినుంచే.. జగన్, భారతికి షాక్ తప్పదా?

Sunitha: వైయస్ వివేకా హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. వైయస్ వివేకా హత్య కేసును సిబిఐ వేగంగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైయస్ వివేకా హత్య కేసులో ప్రభుత్వం హస్తము ఉందని ఇప్పటికే పలువురు ఆరోపిస్తున్నారు. ఇక వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అందరిలో మరింత అనుమానాలను పెంచుతున్నాయి. సునీత సైతం వైయస్ కుటుంబ సభ్యులను నిందితులకు పరిగణిస్తూ మాట్లాడటంతో అనుమానాలు బలపడుతున్నాయి.

ఇక వైయస్ వివేక హత్య కేసు వేగంగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలపై ఈ ప్రభావం పడబోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో అణచి వేయడం కోసం సునీత ఎన్నికల బరిలో దిగబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కడప ఎంపీ అభ్యర్థిగా టిడిపి పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.

 

సునీత టిడిపి పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆమె టిడిపి పార్టీలోకి వెళ్ళితే వెళ్ళవచ్చు కానీ మాపై ఆ బంధాలు వేసి వెళ్లాల్సిన అవసరం లేదని గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇక సునీత వీక్ నెస్ క్యాష్ చేసుకున్న తెలుగుదేశం పార్టీ తనని తమ పార్టీలోకి ఆహ్వానించి వైయస్ కుటుంబానికి వ్యతిరేకంగా కడప ఎంపీ బరిలో దింపుబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే కడపలో వైయస్ జగన్ భారతీ దంపతులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

 

కడప ఎంపీ బరిలో వైయస్ వివేకా కూతురిని తమ అభ్యర్థిగా నిలబడితే ఎలా ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.కుటుంబ వివాదంలోకి పగ పార్టీ ప్రవేశానికి అనుమతిస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.అయితే వైయస్ జగన్ పార్టీని సునీత ఒక్కతే ఎదుర్కోవడం ఎంతో కష్టం కనుక తనకు ఏదో ఒక పార్టీ మద్దతు తప్పకుండా ఉండాలని తెలుస్తోంది. అందుకే తెలుగుదేశం పార్టీ తనకు మద్దతు ఇస్తూ కడప ఎంపీ స్థానం నుంచి బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -