Hall Ticket: హాల్ టికెట్ పై సన్నీ లియోన్ హాట్ పిక్.. అందరు షాకయ్యేలా?

Hall Ticket: కర్ణాటకలో టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఓ యువతికి అందజేసిన హాల్ టికెట్‌లో అభ్యర్థి ఫొటో ప్లేసులో పోర్న్ స్టార్ ఫొటో ఉండటం విమర్శలకు దారి తీస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగం సంపాదించేందుకు అర్హత పరీక్షలను రాయడం, వాటిల్లో సక్సెస్ అవ్వడం అగ్నిపరీక్షలా మారుతోంది. అలాంటిది హాల్ టికెట్‌లో తప్పులు దొర్లడం లేదంటే ఫొటోలు మారడాన్ని ఎలా చూడాలి. ఇది పరీక్ష రాసే వారిని ఎంత డిస్ట్రబ్ చేస్తుందో, వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

 

బీజేపీ సర్కారుపై విమర్శ జడివాన
కర్నాటకలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇటీవల అక్కడ నిర్వహించిన టీచర్‌ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో ఓ యువతికి అందజేసిన హాల్‌ టికెట్‌‌లో అభ్యర్థి ఫొటో స్థానంలో పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఫొటో ఉండటం విమర్శలు దారి తీస్తోంది. ఈ విషయాన్ని కర్నాటక కాంగ్రెస్ నేత ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్ అవుతోంది. హాల్‌ టికెట్‌ను అడ్డుపెట్టుకొని నెటిజన్లు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కర్నాటక సర్కారు అలర్ట్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు విద్యాశాఖ ఆదేశించింది.

విద్యాశాఖను దురుపయోగం చేస్తున్నారు
హాల్ టికెట్ ఘటన మీద కర్నాటక విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీలో బ్లూ ఫిల్మ్‌లు చూసే మంత్రులున్న ప్రభుత్వం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని కాంగ్రెస్‌ సోషల్ మీడియా చైర్‌ పర్సన్ బీఆర్‌ నాయుడు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బీజేపీ నేతలకు సన్నీలియోన్‌ను చూడాలనుకుంటే ఆమె ఫొటోను వేలాడదీయం లాంటివి చేయకూడదన్నారు. అందుకోసం విద్యాశాఖను ఎందుకు ఉపయోగిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

ఇంత నిర్లక్ష్యమా?
కర్ణాటక టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్షల నిర్వాహణపై సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. హాల్ టికెట్ పై సన్నీలియోన్ ఫొటో వ్యవహారం దుమారం రేపడంతో విచారణకు ఆదేశించిన కర్నాటక విద్యాశాఖ.. అభ్యర్థి ఫొటో మారినందుకు పొరపాటును ఒప్పుకుంది. పోర్న్ స్టార్ ఫొటో స్థానంలో యువతి ఫొటోను అప్‌లోడ్ చేస్తామని వివరణ ఇచ్చింది. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని అనుకోవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -