Super Star: ఆ ముగ్గురి మరణాలు కృష్ణను మానసికంగా కృంగదీసాయా?

Super Star: గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల దిగ్గజ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడిచారు. కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌మోహన్ రెడ్డి, మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కౌబాయ్, జేమ్స్ బాండ్ సినిమాలే కాదు.. అల్లూరి సీతారామరాజు వంటి అద్భుతమైన సినిమాల్లో కృష్ణ కూడా నటించారు. 1965లో తేనె మనసులు సినిమాతో సూపర్ స్టార్ కృష్ణ తెరంగేట్రం చేశాడు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబులు స్టార్ హీరోలుగా కొనసాగేవారు.

 

అప్పట్లో వీరి సినిమాలే టాలీవుడ్‌ను షేక్ చేసేవి. అయితే కృష్ణ మానసికంగా కుంగిపోవడం వల్లే గుండెపోటు వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముగ్గురు వ్యక్తులు.. పెద్ద కొడుకు రమేశ్ బాబు, ఆ తర్వాత మొదటి భార్య ఇందిరా దేవి మృతి చేశారు. అప్పుడే తన ఆప్తమిత్రుడైన రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా స్వర్గీయులయ్యారు. దీంతో కృష్ణ మనో వేదనకు గురయ్యాడు. మానసికంగా కృంగిపోవడంతో ఆ ప్రభావం అతడి ఆరోగ్యం పడిందని, అందుకే అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో నేడు తుదిశ్వాన విడిచారు. కాగా, సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ నటుడు కృష్ణంరాజు ఇద్దరూ మంచి స్నేహితులు. స్టార్ హీరోగా.. రాజకీయ నాయకుడిగా ఓ వెలుగు వెలిగారు. సెప్టెంబర్ 11న హైదరాబాబ్‌లో కృష్ణం రాజు ప్రాణాలు విడిచారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -