Super Star Krishna: కృష్ణ రికార్డును బ్రేక్ చెయ్యడం ఎవరికీ సాధ్యం కాదా?

Super Star Krishna: టాలీవుడ్ కౌబాయ్, తెలుగు తెర అల్లూరి.. సూపర్ స్టార్ కృష్ణ. ఈ రోజు మంగళవారం కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. 350కి పైగా చిత్రాలతో తెలుగు వారి గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 1965లో తేనే మనసులు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృష్ణ.. ఆ తర్వాత సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. వెండితెరపై రకరకాల ప్రయోగాలు, సాహసాలు చేస్తూ తిరుగులేని స్టార్‌డమ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.

 

సూపర్ స్టార్ కృష్ణ మొట్టమొదటి స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), మొట్టమొదటి ఈస్ట్ మెన్ కలర్ (ఈనాడు), మొట్టమొదటి 70ఎంఎం సినిమా (సింహాసనం), అలాగే మొట్టమొదటి కౌబాయ్ సినిమా (మోసగాళ్లకు మోసగాడు). అలాగే కృష్ణ ఒకే ఏడాదిలో 17 సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలు అదే సంవత్సరంలో విడుదల అయ్యాయి. ప్రపంచంలోనే ఏ హీరో చేయలేని రిస్క్ కృష్ణ చేశాడు. దీంతో ఇలాంటి అరుదైన రికార్డును సృష్టించిన తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు.

 

 

సినీ ఇండస్ట్రీకి నిర్మాతలు, హీరోయిన్లు, దర్శకులను కృష్ణ పరిచయం చేశాడు. సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ కొన్నాళ్లపాటు రాణించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందాడు. అయితే రాజకీయ వాతావరణం అనుకూలించకపోవడం.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురికావడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో రాజకీయాలకు ఆయన స్వస్తి పలికారు. ఆ తర్వాత కేవలం సినీ రంగంలోనే రాణిస్తూ.. అంచెలంచెలుగా ఎదిగారు.

 

ప్రస్తుత యువ హీరోల తండ్రి, బాబాయ్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ ఏడాది కొడుకు రమేశ్ బాబు, భార్య ఇందిరా దేవి, స్నేహితుడు కృష్ణం రాజు మృతి చెందారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణం రాజుకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. శరీరంలోని అవయవాలు కూడా పని చేయకపోవడంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు. దీంతో ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. తాజా సమాచారం ప్రకారం.. మరో రెండ్రోజుల తర్వాత కృష్ణ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. పంజాగుట్ట మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -