Super Star Krishna: ఆ పేరుతో అవార్డులు ఇవ్వబోతున్న మహేష్.. ఏమైందంటే?

Super Star Krishna: తెలుగు సినిమాను టెక్నికల్ పరంగా పరుగులు పెట్టించడమే కాకుండా, తెలుగు సినిమాలకు కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. సినీ ప్రేక్షకులను ఎప్పుడూ అలరించాలనే ఉద్దేశంతో సూపర్ స్టార్ ఎన్నో ప్రయోగాలు చేయడమే కాకుండా, టెక్నాలజీని పరిచయం చేశాడు. కథల పరంగా ఎంతో వైవిధ్యాన్ని చూపించిన కృష్ణ మరణం.. ఎంతోమందిని కలచి వేసింది.

అనారోగ్య కారణాలతో సూపర్ స్టార్ కృష్ణ మరణించగా.. ఆయన అంతిమ సంస్కారాలను మహాప్రస్థానంలో నిర్వహించారు. అయితే కొడుకు మహేష్ బాబు తన తండ్రి అంతిమ సంస్కారాలను మహాప్రస్థానంలో నిర్వహించడం మీద చాలామంది రకరకాలుగా స్పందించారు. చాలామంది కృష్ణ మెమోరియల్ నిర్మించేలా ఆయనకు చెందిన స్థలంలో నిర్మించి ఉంటే బాగుండేదని అనుకున్నారు.

మొత్తానికి కృష్ణ అంతిమ సంస్కారాలు, అనంతర కార్యక్రమాలు ముగిసిన తర్వాత మహేష్ బాబు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనను ప్రతి సంవత్సరం గుర్తు చేసుకునేలా సూపర్ స్టార్ పేరుతో ఓ అవార్డుని నెలకొల్పాలని, ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి ఈ అవార్డు అందివ్వాలని అనుకుంటున్నాడట.

మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ అవార్డును ఇవ్వాలని మహేష్ బాబు అనుకుంటున్నాడట. అందుకు తగ్గట్టుగా ఓ కమిటీని ఏర్పాటు చేసి, టాలీవుడ్ కు చెందిన వారిని ప్రతి సంవత్సరం సెలెక్ట్ చేయడంతో పాటు గ్రాండ్ గా అవార్డ్ ఫంక్షన్ ని నిర్వహించాలని మహేష్ అనుకుంటున్నాడట. అయితే ఇప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్ పేరుతో అవార్డులను ప్రారంభించి ప్రస్తుతం వాటి ఊసులేకపోవడం తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -