Super Star Krishna: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన కృష్ణ.. తీవ్ర శ్వాసకోశ సమస్యా!?

Super Star Krishna: తెలుగు ప్రేక్షకులకు కొత్త టెక్నాలజీని, కౌబాయ్ సినిమాలను పరిచయం చేసిన స్టార్ సూపర్ స్టార్ కృష్ణ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ మ్యానరిజంతో పాటు స్టైలిష్ లుక్స్ ను పరిచయం చేసిన కృష్ణ.. తాజాగా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు.

 

ప్రస్తుతం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో నివసిస్తున్న సూపర్ స్టార్ కృష్ణకు ఈ ఉదయం తీవ్రమైన శ్వాసకోశ సమస్య తలెత్తడంతో ఆయనను వెంటనే గచ్చిబౌలిలోని కాంటినెంటనెంటల్ ఆస్పత్రికి తరలించారు. వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్న కృష్ణ చాలాకాలంగా సినిమాలు చేయడం లేదు. ఈ మధ్యన భార్య ఇందిరా దేవి మరణం నేపథ్యంలో బయట కనిపించారు. చాలాకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న కృష్ణ హఠాత్తుగా ఆస్పత్రిలో చేరడంతో సూపర్ స్టార్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించిన కృష్ణ.. ఐదు దశాబ్దాలుగా 350కి పైగా సినిమాల్లో నటించారు. కృష్ణకు మొత్తం ఐదుగురు సంతానం ఉండగా.. ఇందిరా దేవితో రమేష్ బాబు, మహేష్ బాబు, విజయ నిర్మలతో పద్మావతి, మంజుల, ప్రియదర్శినిలను కలిగి ఉన్నారు.

 

సినిమా ఇండస్ట్రీకి కృష్ణ చేసిన విశేష సేవలకు గాను ఆయన ఆంధ్రాయూనివర్సిటీ 2008లో డాక్టరేట్ ను ప్రధానం చేసింది. అలాగే ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో పద్మభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది. 1961లో కులగోత్రాలు సినిమాలో తొలిసారి కృష్ణ సినిమా ఇండస్ట్రీకి పరియమయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -