Super Star: సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ సూపర్ స్టారే!

Super Star: సినిమాల్లో సాధించిన ఘనతలకు హీరోలకు అవార్డులు, రివార్డులు, నూతన పేర్లు వస్తుంటాయి. అయితే కృష్ణ సినిమాలతో పాటు నిజజీవితంలోనూ సూపర్ స్టార్‌గా నిలిచారు. ఎన్నో కొత్త హంగులను ధైర్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

గూఢచారి 116 సినిమాతో టాలీవుడ్‌కు తొలిసారి జేమ్స్‌బాండ్‌ను పరిచయం చేశారు.  తొలి సోషియో కలర్ మూవీగా తేనె మనసులు మూవీని, తొలి కౌబాయ్ మూవీగా మోసగాళ్లకు మోసగాడు మూవీని, తొలి ఈస్ట్ మన్ కలర్ మూవీగా ఈనాడు సినిమాను, తొలి 70ఎంఎం మూవీగా సింహాసనం మూవీని, తొలి సినిమా స్కోప్‌గా అల్లూరి సీతారామరాజు మూవీని, తొలి డీటీఎస్ మూవీగా తెలుగు వీరలేవరా వంటి చిత్రాలను అందించిన ఘనతను దక్కించుకున్నారు.

వెతుక్కుంటూ వచ్చిన అవార్డులు
కృష్ణ తన కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. అల్లూరి పాత్రలో చేసిన నటనకు 1974లో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. 1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం వరించింది. 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2009లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం వంటివి కృష్ణకు లభించాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది.

బిరుదులకే వన్నె తెచ్చారు
తన కెరీర్‌లో సూపర్ స్టార్, జేమ్స్‌బాండ్ వంటి బిరుదులను అభిమానుల నుంచి కృష్ణ అందుకున్నారు. 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి చేతుల మీదుగా నటశేఖర బిరుదును పొందారు.  కృష్ణ కెరీర్ తొలిరోజుల్లో నటించిన సాక్షి చిత్రం 1968లో తాష్కెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో ప్రదర్శించారు. 1972లో ఆయన నటించిన పండంటి కాపురం చిత్రం ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఎంపికై నేషనల్‌ అవార్డును కూడా కైవసం చేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -