Super Star Krishna: అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన సూపర్ స్టార్ కృష్ణ!

Super Star Krishna: టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కృష్ణ మొన్న రాత్రి తీవ్రమైన గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఇక ఈయన పరిస్థితి విషమంగా ఉందని వెంటిలేటర్ పై చికిత్స అందించారు.

 

రైతులు ఈయనకు చికిత్స అందిస్తూనే 24 గంటలు గడిస్తే కానీ ఈ విషయం చెప్పలేమని తెలియజేశారు. ఇలా వెండి లెటర్ పై చికిత్స తీసుకుంటున్నటువంటి కృష్ణ నేడు ఉదయం నాలుగు గంటలకు తుది శ్వాస విడిచినట్లు కాంటినెంటల్ వైద్యులు వెల్లడించారు.ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కృష్ణ తుది శ్వాస విడ్చడంతో ఎంతోమంది అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వెంటనే హాస్పిటల్ కి చేరుకున్న మహేష్ బాబు అక్కడే ఉన్నట్లు సమాచారం. ఇక కృష్ణ మరణించారనే వార్త తెలియగానే ఒక్కసారిగా సినీ ప్రపంచం షాక్ కి గురైంది.గత నెల రోజుల క్రితం కృష్ణ సతీమణి ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే. ఇక ఆ విషయం మర్చిపోకముందే కృష్ణ మృతి చెందడంతో మహేష్ బాబు కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -