Surykumar: నెంబర్ వన్ బ్యాటర్‌గా సూర్యకుమార్.. ర్యాకింగ్స్ విడుదల చేసిన ఐసీసీ

Surykumar: టీమిండియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి తెలియనివారందరూ ఉండరు. అతడిని అందరూ స్కై అని పిలుస్తూ ఉంటారు. తన బ్యాట్‌తో స్టేడియంలో స్వైరవిహరం చేస్తూ ఉంటారు. బ్యాటింగ్‌లో చెలరేగుతూ ఉంటారు. సిక్స్‌లు, ఫోర్లతో బ్యాటింగ్‌లో విజృంభిస్తూ ఉంటాడు. ఏ ఫార్మట్‌ అయినా సరే బ్యాటింగ్‌లో రాణిస్తూ ఉంటారు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే సూర్యకుమార్.. ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ కీలక ఆటగాడిగా బరిలోకి దిగుతాడు. దీంతో అతడిపై టీమ్‌కు, అభిమానులకు భారీ అంచనాలు ఎప్పుడూ ఉంటాయి.

టెస్టు, వన్డే ఫార్మాట్‌లో కంటే టీ20 ఫార్మట్‌లో సూర్యకుమార్ యాదవ్ కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్‌కు టీ 20 ఫార్మట్‌లోనే ఎక్కువ రికార్డులు ఉన్నాయి. టీ 20లలోనే అతడు బ్యాటింగ్‌తో ఎక్కువ రాణిస్తూ ఉంటాడు. దీంతో టీ 20 పేయర్‌గా అతడికి మంచి పేరు ఉంది. తాజాగా టీ20లలో సూర్యకుమార్ యాదవ్ మరో రికార్డు సృష్టించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు.

 

బుధవారం ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాకింగ్స్‌ను ప్రకటించింది. ఇందులో 906 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. రెండు స్థానంలో పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ 798 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానంలో దాయాది పాకిస్తాన్‌కు చెందిన మరో బ్యాట్స్‌మెన్ బాబర్ అజాం 769 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 612 పాయింట్లతో 15వ స్థానంలో ఉన్నాడు.

 

అటు బౌలింగ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ 145వ స్థానంలో ఉండగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రెండో ర్యాంకులో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ జాబితాలో బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబుల్ హసన్ ఐసీసీ ర్యాకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

 

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -