Suryakumar Yadav: క్రికెట్‌తో పాటు ఇవంటే సూర్యాభాయ్‌కు పిచ్చిపిచ్చిగా ఇష్టమట.. కొత్తది వస్తే వదిలేదే లే..

Suryakumar Yadav: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో అత్యద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఏడాదికాలంగా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ మిడిలార్డర్ బ్యాటర్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక క్యాలెండర్ ఈయర్‌లో వెయ్యి కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న సూర్య.. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో వీరవిహారం చేశాడు. న్యూజిలాండ్ తో సిరీస్ లో భాగంగా రెండో టీ20లో సెంచరీతో చెలరేగాడు.

 

 

చిన్నప్పట్నుంచి క్రికెట్ అంటే అభిమానం పెంచుకున్న సూర్య.. ఆ ఆటలో మెరుపులు మెరిపిస్తున్నాడు. అయితే క్రికెట్ తో పాటు సూర్యకు ఖరీదైన కార్లను డ్రైవ్ చేయడం చాలా ఇష్టమట. ప్రస్తుతం అతడి గ్యారేజ్ లో పలు ఖరీదైన వాహనాలు ఉన్నాయట. వాటిపై ఓ లుక్కేస్తే..

 

ఈ నయా మిస్టర్ 360కి మెర్సిడిస్ బెంజ్ జీఎల్ఈ కోప్, బీఎండబ్ల్యూ 5 సిరీస్ 530డీ ఎం స్పోర్ట్, ఆడి ఏ6, లాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్, నిస్సాన్ జొంగలు ఉన్నాయి. మ్యాచ్ లు లేకుంటే సూర్య తన కార్లలో భార్యతో కలిసి లాంగ్ డ్రైవ్ లకు వెళ్తుంటాడట. ముంబై రోడ్ల మీద రయ్ రయ్ మని దూసుకుపోతాడట. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ వస్తే దానిని కొనేందుకు సూర్య ఆసక్తి చూపుతాడట..

 

పైన పేర్కొన్న కార్ల ధరలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ప్రకారం మెర్సిడిస్ కారు ధర సుమారు రూ. 92 లక్షల నుంచి మొదలై రూ. 1.30 కోట్ల వరకు ఉంది. బీఎండబ్ల్యూ 5 సిరీస్ ధర రూ. 75 లక్షలు కాగా.. ఆడి రూ. 65 లక్షల పైమాటే. రేంజ్ రోవర్ ధర రూ. 90 లక్షల వరకు ఉండగా నిస్సన్ ధర రూ. 15లక్షలుగా ఉంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -