Suryakumar Yadav: అతడే లేకుంటే ఎప్పుడో బ్యాగులు సర్దుకునేవాళ్లం.. అంతా మిస్టర్ 360 పుణ్యమే..

Suryakumar Yadav: టీ20 ప్రపంచకప్‌ సాధనే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా బ్యాటింగ్ అనుకున్న స్థాయిలో ఉందా..? అంటే లేదు అనే చెప్పొచ్చు. ఓపెనర్లలో కెఎల్ రాహుల్ తొలి మూడు మ్యాచ్ లలో దారుణంగా విఫలమయ్యాడు. రోహిత్ శర్మ.. ఒక్క నెదర్లాండ్స్‌తో తప్ప మిగిలిన మ్యాచ్‌లలో దారుణంగా విఫలమవుతున్నాడు. కోహ్లీ ఒక్కడు ఆడుతున్నాడు. మిడిలార్డర్‌లో హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్‌తో పాటు చివర్లో వచ్చే ఫినిషర్‌లు కూడా విఫలమవుతున్నారు. కానీ టీమిండియాను ప్రతీ మ్యాచ్‌లో ఆదుకుంటున్నది కోహ్లీ తర్వాత ఒక్క సూర్యకుమార్ యాదవ్ మాత్రమే..

 

ఈ టోర్నీకి ముందే అత్యద్భుత ఫామ్ తో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన సూర్యాభాయ్.. ప్రపంచకప్‌లో కూడా రాణిస్తున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విఫలమైనా తర్వాత నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై రాణించాడు. ఈ మ్యాచ్ లలో భారత్ భారీ స్కోర్లు చేయడానికి కారణం సూర్యానే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఈ టోర్నీలో ఇప్పటికే సూర్య.. ఐదు మ్యాచ్‌లు ఆడి ఐదు ఇన్నింగ్స్‌లలో 225 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సూర్య స్ట్రైక్ రేట్ ఏకంగా 193.97గా నమోదుకావడం గమనార్హం. ప్రస్తుతం అగ్రశ్రేణి ప్రపంచ స్థాయి ఆటగాళ్లకు కూడా ఈస్థాయి స్ట్రైక్ రేట్ లేదు.

 

రోహిత్ తో పాటు టాపార్డర్ వైఫల్యం చెందినప్పుడు సూర్య టీమిండియా బ్యాటింగ్ బాధ్యతలు మోస్తున్నాడు. అతడే లేకుంటే భారత జట్టు గత పలు మ్యాచ్‌లలో 140-150 కూడా చేసేది కష్టమేనని అంటున్నాడు భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్.

 

గవాస్కర్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ సూర్య ఇన్నింగ్స్ చివర్లో గనక ఆడకపోయి ఉంటే భారత్ 140-150 స్కోరు కూడా చేసి ఉండేది కాదు. భారత్ అతడి మీద బాగా ఆధారపడి ఉంది. ఇదే క్రమంలో సూర్య తర్వాత రెండు మ్యాచ్ లలో కూడా చెలరేగుతాడని ఆశిద్దాం. అయితే ఇప్పటివరకూ జరిగినవన్ని లీగ్ మ్యాచ్ లు. ఇక్కడ ఒక మ్యాచ్ పోయినా మరో ఛాన్స్ ఉండేది. కానీ ఇకనుంచి అలా కాదు. సెమీస్, ఫైనల్స్ లో ఓడితే ఇంటికి రావాల్సిందే. అందుకు ఇకనైనా భారత జట్టు టాపార్డర్ మెరుగైన ప్రదర్శనలు చేసి జట్టును ఆదుకోవాలి. రోహిత్ ఎంత త్వరగా ఫామ్ లోకి వస్తే అంత బెటర్..’ అని తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -