Suryakumar Yadav: సూర్యకుమార్ రూటే సపరేటు.. ఒత్తిడితో ఆడటమే ఇష్టమంటున్న స్టార్ ఆటగాడు

Suryakumar Yadav: టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి లేటుగా వచ్చినా లేటెస్టుగా ఆడుతున్నాడు. 31 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసినా ధనాధన్ ఇన్నింగ్స్‌తో అభిమానులను మైమరిపిస్తున్నాడు. ఇటీవల శ్రీలంకతో మూడో టీ20లో సెంచరీతో అదరగొట్టాడు. అయితే తన అరంగేట్రం ఆలస్యం కావడంతో ఆకలి మీద ఉన్నానని సూర్యకుమార్ చెప్తున్నాడు. దేశవాళీ క్రికెట్ ఎక్కువగా ఆడటం తనకు మంచే చేసిందని వివరిస్తున్నాడు.

 

దేశవాళీ క్రికెట్‌లో మంచిగా ఆడుతున్న జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం కొంచెం కష్టంగా అనిపించినా.. తాను ఆడుతున్న మ్యాచ్ ప్రాధాన్యాన్ని గుర్తించి ఆడేవాడిని అని సూర్యకుమార్ తెలిపాడు. ఆట పట్ల ఉత్సాహమే తనను ముందుకు నడిపించిందని పేర్కొన్నాడు. ఒత్తిడిలో ఆడటం తనకు మరింత ఇష్టమని చెప్పాడు. ఒక మ్యాచ్‌కు సన్నద్ధమయ్యేటప్పుడు మన మీద మనం ఒత్తిడి పెంచుకోవడం అవసరమేనని.. ఒత్తిడి ఎంత ఎక్కువైతే అంత మంచి ప్రదర్శన చేస్తానని వివరించాడు.

 

తన ఇన్నింగ్స్‌లలో ఏది ఉత్తమం అంటే తాను చెప్పలేనని.. తాను కఠిన పరిస్థితుల్లో బరిలోకి దిగి ఆడిన ఇన్నింగ్స్ అన్నీ తనకు ఇష్టమేనని సూర్యకుమార్ వెల్లడించాడు. గత ఏడాది కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడానని.. ఈ ఏడాది అదే ప్రదర్శనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. మాములుగా కఠిన పరిస్థితుల్లో అందరూ ఆశలు వదులుకుంటారని.. కానీ తాను మాత్రం అసలు కథ అక్కడి నుంచే ప్రారంభమైందని భావిస్తానని సూర్యకుమార్ తెలిపాడు.

 

ఇంటికెళ్లినా ఆట గురించే ఆలోచిస్తా
తన క్రికెట్ ప్రయాణంలో కుటుంబం పాత్ర ఎంతో ముఖ్యమైనది అని సూర్యకుమార్ చెప్పాడు. తన తండ్రి ఇంజినీర్ అని.. ఆయనకు క్రీడలతో అసలు సంబంధమే లేదన్నాడు. కానీ తనలోని క్రికెట్ మెరుపును గుర్తించి ముందుకు నడిపించారని.. తన కోసం తన తల్లి ఎన్నో త్యాగాలు చేసిందని తెలిపాడు. అందుకే ఇంటికెళ్లినా తాను ఆట గురించి, పోషకాహారం తీసుకోవడం గురించే మాట్లాడతానని.. తన భార్య కూడా తనకు ఎంతో గొప్ప ప్రోత్సాహం అందించిందని పేర్కొన్నాడు.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -