Shiva Jyothi: బిగ్‌బాస్ శివజ్యోతికి అభిమానులు స్వీట్ వార్నింగ్

Shiva Jyothi: ప్రముఖ న్యూస్ ప్రజెంటర్ శివజ్యోతి అందరికీ సుపరిచితురాలు. గతంలో సావిత్రిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలంగాణ యాసలో ఈమె చెప్పే వార్తలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. న్యూస్ ప్రజెంటర్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న శివజ్యోతి.. ప్రముఖ టెలివిజన్ షో ‘బిగ్‌బాస్’లో కంటెస్టెండ్‌గా ఎంపికై సెలబ్రిటీగా మారిపోయారు. బిగ్‌బాస్ షో ముగిసిన తర్వాత శివజ్యోతిని అందరూ జ్యోతక్కగా పిలవడం ప్రారంభించారు. ప్రస్తుతం న్యూస్ ప్రజెంటర్‌గా, స్పెషల్ ఈవెంట్లు, బుల్లితెర కామెడీ షోలలో కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఇటీవలే శివజ్యోతి కొత్త బీఎండబ్ల్యూ కారు కొంది. ఈ విషయాన్ని ఫ్యాన్స్‌ కు చెబుతూ గుడ్ న్యూస్‌ను షేర్ చేసింది.

బిగ్‌బాస్ షో తర్వాత శివజ్యోతి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తమ రోజువారీ అప్‌డేట్స్, పండగలు, మధుర క్షణాలకు సంబంధించి వ్లాగ్ చేస్తూ తన అభిమానులకు పంచుకుంటారు. అయితే శివజ్యోతి తన యూట్యూబ్‌లో దీపావళికి సంబంధించిన ఓ వ్లాగ్ చేసింది. దీన్ని ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ శివజ్యోతిపై ఫైర్ అవుతున్నారు. ప్రేమగా వార్నింగ్ ఇస్తున్నారు.

కారులో ప్రయాణిస్తున్నప్పుడు శివజ్యోతి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. దీంతో కొందరు అభిమానులు ‘అక్కా.. సీట్ పెట్టుకో..’ అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరికొందరు సీటు బెల్టు పెట్టుకుని ప్రయాణం చేయండి అంటూ సలహా ఇస్తున్నారు. కాగా, దీపావళికి అత్తగారింటికి వెళ్తున్న వీడియోలో.. శివజ్యోతి ప్రయాణం మొదలైనప్పటి నుంచి.. మార్గమధ్యలో దాబాలో భోజనం చేయడం, ఊరికి వెళ్లడం, రాత్రి పూట క్రాకర్స్ కాల్చడం, డ్యాన్స్‌ కు సంబంధించిన అన్ని వీడియో రూపంలో పొందిపర్చారు. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు. 2020లో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించింది. ఈ వీడియోను తాజాగా శివజ్యోతి ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -