T20: ఓ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పిన డేవిడ్ వార్నర్

T20: ప్రస్తుతం క్రికెట్‌లో ఉన్న మూడు ఫార్మాట్లలో పొట్టి క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్ మరే ఇతర ఫార్మాట్‌కు లేదు. అందుకే పలువురు ఆటగాళ్ల సుదీర్ఘంగా సాగే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికి కేవలం టీ20లలో కొనసాగాలని భావిస్తున్నారు. కొందరు ఆటగాళ్లు మాత్రం కేవలం టెస్టులు, టీ20లు మాత్రమే ఆడాలని నిర్ణయించుకుంటున్నారు. ఇటీవల ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇదే నిర్ణయాన్ని తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా టెస్టులకు వీడ్కోలు పలికి కేవలం వన్డేలు, టీ20లు మాత్రమే ఆడాలనుకుంటున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో క్రికెట్‌లో ఓ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని చెప్పాడు. మరో ఏడాది మాత్రమే తాను టెస్టుల్లో కొనసాగుతానని.. ఆ తర్వాత రిటైర్ అవుతానని సంకేతాలు పంపించాడు. వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రం 2024 టీ20 ప్రపంచకప్ వరకు ఆడతానని చెప్పాడు.

ప్రస్తుతం డేవిడ్ వార్నర్‌కు 36 ఏళ్లు ఉన్నాయి. కెరీర్‌లో ఇప్పటివరకు 96 టెస్టులు, 138 వన్డేలు,99 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. దాదాపుగా మూడు ఫార్మాట్లలో కలిపి 17వేలకు పైగా పరుగులు పూర్తి చేశాడు. వార్నర్ పరుగుల్లో 43 సెంచరీలు, 84 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో 2011లో అరంగేట్రం చేసిన వార్నర్ 46.52 స్ట్రైక్ రేటు కలిగి ఉన్నాడు. టెస్ట్ కెరీర్‌లో వార్నర్‌ ఖాతాలో 24 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

టీ20లు ఆడటమే ఇష్టమని చెప్పిన వార్నర్

తనకు క్రికెట్‌లో టీ20లు ఆడటమే ఎంతో ఇష్టమని వార్నర్ వెల్లడించాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో అతడు రాణించలేదు. కానీ 2024 ప్రపంచకప్‌లో రాణిస్తాననే నమ్మకం తనకు ఉందని వార్నర్ చెప్పాడు. చాలా మంది క్రికెటర్లు వయసు మళ్లడంతో ఆటకు వీడ్కోలు పలుకుతారని..ఇప్పుడు తన వంతు వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారని.. కానీ తాను మాత్రం వైట్ బాల్ క్రికెట్‌లో 2024 వరకు ఆడాలనుకుంటున్నట్లు సెలక్టర్లకు వార్నర్ సంకేతాలు పంపాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -