T20: బ్రాహ్మిణ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా’గా బీసీసీఐ మారిందా?

T20: టీ20 వరల్డ్ కప్ మీద భారీ అంచాలను పెట్టుకున్న టీమిండియా తుస్సుమనిపించింది. ఇంగ్లండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఇంగ్లీష్ టీం చేతిలో ఓడిపోవడంతో.. టీ20 వరల్డ్ కప్ నుండి బయటకు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఆడుతోంది. అయితే టీమిండియాను ప్రస్తుతం శిఖర్ ధావన్ లీడ్ చేస్తుండటం తెలిసిందే.

 

టీమిండియా వ్యవహారాలను చూసుకునే బీసీసీఐ మీద సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ అంటే పూర్తిగా ఒక కులానికి ప్రాధాన్యత ఇచ్చే సంస్థగా మారిపోయిందని అంటున్నారు. న్యూజిలాండ్ టూర్ కు టీమిండియాలో సూర్యకుమార్ యాదవ్ కు చోటు దక్కకపోవడంతో మొదలైన రభస.. ఇప్పుడు నెట్టంట పెద్ద చర్చకు దారితీసింది.

 

బీసీసీఐ అంటే బ్రాహ్మిణ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాగా మారిపోయిందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టీమిండియాలోని 11 మంది క్రికెటర్లలో 7 మంది క్రికెటర్లు కేవలం ఒక కులానికి చెందిన వారే ఉండటం ఏంటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఎస్సీల పట్ల బీసీసీఐ ఎందుకు చిన్నచూపు చూస్తోందని, బీసీసీఐ కులవివక్షను ప్రదర్శిస్తోందని మండిపడుతున్నారు.

 

#Casteist_BCCI పేరుతో సోషల్ మీడియాలో చాలామంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అగ్రకులస్థులకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని, నిమ్న కులాలకు చెందిన క్రికెటర్లకు బీసీసీఐ అవకాశం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. కాగా మరో వర్గం దీనిని వ్యతిరేకిస్తోంది. క్రీడలను కులాలకు అతీతంగా చూడాలని, మంచి ప్రతిభ ఉంటే బీసీసీఐ తప్పక అవకాశం ఇస్తుందని అంటున్నారు. అటు సూర్యకుమార్ యాదవ్ ఏడాదిగా రెస్ట్ లేకుండా ఆడుతున్నందుకే సెలక్టర్లు అతడికి రెస్ట్ ఇచ్చి ఉంటారని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -