T20: అక్తర్‌కు షమీ పంచ్.. మాములుగా లేదుగా..!!

T20: టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ పరాజయం పాలైంది. 1992 ప్రపంచకప్ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తామని బీరాలు పలికిన పాకిస్థాన్ జట్టు తుది సమరంలో చతికిలపడింది. దీంతో ఆ జట్టుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. పాకిస్థాన్ ఆడిన ఆటకు ఫైనల్ వరకు రావడమే గొప్పంటూ పలువురు నెటిజన్‌లు తమదైన శైలిలో ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. ఏదో దక్షిణాఫ్రికా జట్టు పుణ్యమా అంటూ సెమీస్‌కు వచ్చిన ఆ జట్టుకు కప్పు కొట్టేంత సీన్ లేదని అభిప్రాయపడుతున్నారు.

అయితే పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్, టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ మధ్య ఈ అంశంపై ట్విట్టర్‌లో మాటల యుద్ధం నడుస్తోంది. ఫైనల్లో పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత హృదయం పగిలిన ఎమోజీని అక్తర్ ట్వీట్ చేశాడు. దీనికి రిప్లై ఇస్తూ మహ్మద్ షమీ.. ‘సారీ బ్రదర్.. కర్మ అంటే ఇదే’ అంటూ ట్వీట్ చేశాడు. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో భారత బౌలర్ల వైఫల్యంపై ఇటీవల అక్తర్ విమర్శలు గుప్పించాడు. దీంతో అక్తర్‌కు షమీ ఇలా బదులిచ్చాడు.

అయితే మహ్మద్ షమీ తీరును పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు. క్రికెటర్లుగా మనమంతా బ్రాండ్ అంబాసిడర్లు అని.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు క్రికెటర్లు ప్రయత్నించాలి కానీ ఇలా విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదని అఫ్రిది హితబోధ చేశాడు. మాజీ ఆటగాడు అయినా.. ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్ అయినా ఇలాంటి విద్వేషాలకు దూరంగా ఉండాలని.. మనమే ఇలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారని అఫ్రిది నంగనాచి మాటలు చెప్పాడు.

పాకిస్థాన్ ఓటమికి బ్యాటింగే కారణం

ఇంగ్లండ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో బ్యాటర్లు చేతులెత్తేయడమే పాకిస్థాన్ ఓటమికి కారణమని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు. 16 ఓవర్లలో 119/4తో ఉన్న ఆ జట్టు.. చివరి 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే చేసిందని గుర్తుచేశాడు. ఓవర్‌కు 10 పరుగులు చేసినా జట్టు స్కోరు దాదాపు 160 పరుగులకు చేరుకునేదని చెప్పాడు. ఎంసీజీ గ్రౌండ్ బౌండరీల సరిహద్దులను పాక్ బ్యాటర్లు అర్థం చేసుకోలేదని.. కొంచెం బుర్ర ఉపయోగించి సింగిల్స్, డబుల్స్‌ తీసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -