T20: పొట్టి సమరం మరింత రసవత్తరం.. కొత్త ఫార్మాట్‌లో వచ్చే టీ20 వరల్డ్ కప్

T20: గతేడాది దుబాయ్, ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన పురుషుల టీ20 ప్రపంచకప్‌ ఒకే ఫార్మాట్ లో జరిగింది. కానీ వచ్చే టీ20 వరల్డ్ కప్ (2024)లో మార్పులు ఉండనున్నాయి. ఈ టోర్నీని భిన్నమైన ఫార్మాట్ లో నిర్వహిస్తామని తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తెలిపింది. గత రెండు ఎడిషన్లలో క్వాలిఫయర్ తర్వాత సూపర్ 12 దశను నిర్వహించారు. కానీ 2024లో ఈ ఫార్మాట్ మారనుంది.

 

ఐసీసీ వెల్లడించిన వివరాల మేరకు.. వచ్చే టీ20 ప్రపంచకప్ లో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. ఈ మేరకు 20 టీమ్ లను నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. ఒక్కో గ్రూప్ లో ఐదేసి జట్లు ఉంటాయి. నాలుగు గ్రూపుల్లో ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్టు సూపర్ – 8 కు చేరతాయి. ఇక్కడ కూడా 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడతాయి.

సూపర్ – 8లోని రెండు గ్రూపులలో టాప్ – 2 లో ఉన్న టీమ్ (నాలుగు) లు సెమీస్ లో పోటీ పడతాయి. సెమీఫైనల్లో గెలిచిన విజేతలు ఫైనల్ ఆడతాయి.

వచ్చే టీ20 వరల్డ్ కప్ ను అమెరికా, వెస్టిండీస్ దీవులలో నిర్వహించనున్నారు. ఈసారి 20 జట్లతో ఆడనుండగా.. ఇప్పటికే 12 జట్లు తమ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. ఆ జాబితాలో ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, లతో పాటు ఆతిథ్య దేశాలుగా యూఎస్ఎ, వెస్టిండీస్ కూడా అర్హత సాధించాయి. మిగిలిన 8 జట్లను రీజినల్ క్వాలిఫికేషన్ ద్వారా ఎంపిక చేయనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -