T20 World Cup 2022: మెల్‌బోర్న్‌కు వానగండం.. ఇంగ్లాండ్-పాకిస్తాన్ ఫైనల్ జరిగేది వరుణుడు దయతలిస్తేనే..

T20 World Cup 2022: ఉత్కంఠతో కూడిన మ్యాచ్‌లు, అనూహ్య విజయాలు, ఎవరూ ఊహించని సెమీస్ మ్యాచ్‌ల నడుమ టీ20 ప్రపంచకప్ ఫైనల్ దశకు చేరుకున్నది. ఈ టోర్నీలో మిగిలున్నది ఒకే ఒక్క మ్యాచ్. నవంబర్ 13న ఇంగ్లాండ్ – పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరగాల్సి ఉంది. 1992 తర్వాత 30 ఏండ్లకు ఈ రెండు జట్లు ఐసీసీ ఈవెంట్ ఫైనల్‌లో పోటీ పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనేది ఇప్పుడు అనుమానంగా ఉంది. మ్యాచ్‌కు వేదిక అయిన మెల్‌బోర్న్ లో మ్యాచ్ జరిగేది వరుణుడు కరుణిస్తేనే..

 

మెల్‌బోర్న్ లోని స్థానిక వాతావరణ శాఖ అందజేసిన సమాచారం మేరకు ఆదివారం ఇక్కడ వర్షం కురిసే అవకాశాలు 95 శాతంగా ఉన్నాయి. ఆదివారం ఇక్కడ 8 నుంచి 20 మిల్లీ మీటర్ల వర్షం కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. శుక్రవారం ఉదయం కూడా ఇక్కడ గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడిందని తెలుస్తున్నది.

వర్షం ముప్పు నేపథ్యంలో ఈ మ్యాచ్ జరుగుతుందా..? అనే అనుమానాలకు తెరలేచినట్టైంది. వరుణుడు గనక అంతరాయం కలిగిస్తే ఈ మ్యాచ్ జరుగడం కష్టమే. అయితే ఈ టోర్నీలో లీగ్ దశలో మ్యాచ్ లకు రిజర్వ్ డే లేకున్నా సెమీస్, ఫైనల్ కు ఉన్నాయి. ఒకవేళ ఆదివారం మ్యాచ్ ప్రారంభమై కాసేపయ్యాక వర్షం పడితే తిరిగి మరుసటి రోజు ఆట ఎక్కడ ఆగిందో అక్కడ్నుంచి ప్రారంభిస్తారు. అలా కాకుండా సోమవారం కూడా వరుణుడు కరుణించకుంటే కనీసం 10 ఓవర్ల గేమ్ అయినా నిర్వహిస్తారు.

10 ఓవర్లు కాదు కదా.. పది బంతులు వేసే అవకాశం కూడా లేకుంటే మాత్రం అప్పుడు మ్యాచ్ ను రద్దు చేయడం తప్ప మరో అవకాశం ఉండదు. ఫైనల్ రద్దు అయితే అప్పుడు ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు. ఈ టోర్నీలో మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన భారత్-పాక్ మ్యాచ్ తప్ప అక్కడ జరిగిన ప్రతీ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కల్పించాడు. పలు మ్యాచ్ లు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దవడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -