T20 World Cup 2022: మీకోసం మెల్‌బోర్న్‌లో వేచి చూస్తున్నాం.. రండి చూసుకుందాం..! టీమిండియాకు పాక్ మాజీ పేసర్ సవాల్

T20 World Cup 2022:టీ20 ప్రపంచకప్ లో బుధవారం న్యూజిలాండ్‌తో ముగిసిన సెమీఫైనల్లో గెలిచి ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్.. నేడు ఇంగ్లాండ్-ఇండియా మ్యాచ్ లో విజేతతో తలపడనుంది. ఈనెల 13న మెల్‌బోర్న్ వేదికగా జరిగే ఫైనల్ లో కీలక మ్యాచ్ ఆడుతుంది. అయితే రెండో సెమీస్‌కు ముందు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్.. టీమిండియాకు వ్యంగ్యంగా విషెస్ చెబూతూ సవాల్ కూడా విసిరాడు. మెల్‌బోర్న్‌లో తాము ఇండియా కోసం వేచి చూస్తున్నామని వ్యాఖ్యానించాడు.

 

భారత్-ఇంగ్లాండ్ రెండో సెమీస్ నేపథ్యంలో అక్తర్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అక్తర్ స్పందిస్తూ.. ‘హిందూస్తాన్.. మేం మెల్‌బోర్న్ చేరుకున్నాం. మీకోసం మేం వెయిట్ చేస్తున్నాం. మీరు రండి. ఇంగ్లాండ్ తో మ్యాచ్‌కు మీకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నా. ఇంగ్లాండ్ తో గెలిచి మెల్‌బోర్న్ కు రండి.. ఇక్కడ మేం టోర్నీ తొలి మ్యాచ్ లో ఓడిపోయాం. కానీ ఇప్పుడు అలా కాదు. ఇండియా-పాకిస్తాన్ ఫైనల్స్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా..’ అని వ్యాఖ్యానించాడు.

అక్తర్ ట్వీట్ పై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అదృష్టం కొద్దీ సౌతాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడటంతో సెమీస్ కు చేరుకున్న మీరు (పాకిస్తాన్) మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని.. గతనెలలో మెల్‌బోర్న్ లో జరిగింది అప్పుడే మరిచిపోయారా..? అని అక్తర్ కు చురకలంటిస్తున్నారు. అయినా అక్తర్ మరీ అంత మురిసిపోవాల్సిన పన్లేదని.. ఏ టైమ్ లో ఎలా ఆడుతుందో తెలియని పాకిస్తాన్ ఆటపై అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని మండిపడుతున్నారు.

అదృష్టం కలిసొచ్చి సెమీస్ చేరి అక్కడ కివీస్ ను ఓడించగానే పాకిస్తాన్ పెద్ద ఛాంపియన్ జట్టుగా ఫీల్ కావొద్దని.. ఇంగ్లాండ్ ను ఓడించి టీమిండియా మెల్‌బోర్న్ చేరుకోవడం ఖాయమని.. అక్తర్ నువ్వు ఈ ట్వీట్ ను భద్రపరుచుకో, ఈనెల 13 తర్వాత మాట్లాడుకుందామని విరుచుకుపడుతున్నారు. మరికొందరు 2007 టీ20 ప్రపంచకప్ కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ అక్తర్ కు కౌంటర్ ఇస్తున్నారు.

ఇదిలాఉండగా నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు ఇండియా-ఇంగ్లాండ్ మధ్య అడిలైడ్ వేదికగా ప్రపంచకప్ రెండో సెమీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు ఇప్పటికే తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -