Komatireddy Venkatareddy: రేవంత్ ను వదిలి ఆ నేతను టార్గెట్ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkatareddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు రగిలిపోతున్నాయి. ఆధిప్యత పోరు భగ్గుమంటోంది. సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు సీనియర్ల బహిరంగంగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. సీనియర్ నేతల మధ్య విబేధాలు రోడ్డు్న పడతాయి. ఒకరంటే ఒకరికి అసలు పడటం లేదు. ఒకే పార్టీలోని నేతల మధ్య విబేధాలు మండుతున్నాయి. దీని వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి చులకన భావం ఏర్పడుతోంది. అసలే దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీని నేతల మధ్య వర్గపోరు వల్ల మరింత నష్టపోతుంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా.. లేనట్లుగానే ఉంది.

ఇప్పటికే రేవంత్ రెడ్డి, సీనియర్ల మధ్య విబేధాలు తారాస్ధాయిలో ఉన్నాయి. కొత్త పీసీసీ చీఫ్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డిని ఎదగనీయకుండా సీనియర్లు అడ్డుకుంటున్నారు. రేవంత్ ఏం పనిచేసినా సరే ఆయన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. సీనియర్లు రేవంత్ కు అసలు సహకరించడం లేదు. రేవంత్ తీరుపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తున్నారు. సీనియర్ల అసలు సహకరించకపోవడం, తనకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తుండటంతో రేవంత్ కూడా ఏం చేయలేని పరిస్ధితి. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రాకుండా చేసేందుకు సీనియర్ల ఢిల్లీ లాబీయింగ్ చేశారు.

కానీ చివరికి రేవంత్ రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో అది జీర్ణించుకోలేని భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు రేవంత్ పై భగ్గుమంటున్నారు. రేవంత్ కు సహకరించకుండా ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. తమకు చెప్పకుండా సీనియర్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని రేవంత్ పై సీనియర్ల మండిపుతున్నారు. ఇక రేవంత్ కూడా పార్టీకి పనికిరాని సీనియర్లను పక్కన పెడుతున్నారు. కాంగ్రెస్ ను తెలంగాణలో బలోపేతం చేసేందుకు రేవంత్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. సీనియర్ల వ్యవహారశైలితో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది.

ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే రేవంత్ పై పోరు కొనసాగిస్తుననారు. ఆయన పీసీసీ చీఫ్ గా ఉన్నంతవరకు గాంధీభవన్ లోకి అడుగుపెట్టబోనతంటూ శపథం చేశారు. రేవంత్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయతే ఈ క్రమంలో రేవంత్ పైనే కాకుండా షబ్బీర్ అలీపై కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యూపీఏ ఛర్ పర్సనల్, కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా ాంధీకి లేఖ రాయడం కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపుతోంది.

చీటింగ్ సహా చాలా కేసుల్లో షబ్బీర్ అలీకి ప్రత్యేక ప్రమేయం ఉందని, ఆయను పార్టీలో కొనసాగిస్తే పార్టీ పరువుత పోతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోనియాగాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆయను పార్టీలో కొనసాగిస్తే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని, పార్టీ పరువు మరింత పోతుందని లేఖలో పేర్కొన్నారు. షబ్బీర్ అలీని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సోనియాంగాంధీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేయాలని కోమటిరెడ్డి వెంకటరె్డి కోరారు.

అయతే షబ్బీర్ అలీపై ఉన్న కేసుల గురించి చాలామందికి తెలియదు. అవి రాష్ట్రంలో వివావాస్పదం కూడా కాలేదు. ఇలాంటి తరుణంలో షబ్బీర్ అలీని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే రేవంత్ రెడ్డికే అనుకూలంగా షబ్బీర్ అలీ ఉన్నారు. అందుకే షబ్బీర్ అలీని కోమటిరెడ్డి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Ambati Rambabu: చెత్తకుప్పల్లోకి చేరిన వైసీపీ టీ కప్పులు.. ప్రచారం వికటిస్తోందిగా జగన్?

Ambati Rambabu: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసిపి నాయకులకు ప్రచారాల పిచ్చి భారీగా ఉందనే సంగతి మనకు తెలిసిందే. అభివృద్ధి లేకపోయినా ప్రచారం మాత్రం పీక్స్ లో ఉంటుంది. చేసింది...
- Advertisement -
- Advertisement -