YS Jagan: యూనిట్ కు 40 పైసలు పెంపు.. జగన్ సర్కార్ అలా షాక్ ఇవ్వనుందా?

YS Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులపై బాదుడు ఉండదు అంటూ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలలో ఇది ఒకటి. ఇలా మీ బిడ్డ అధికారంలోకి వస్తే కరెంటు బిల్లు పెంపు ఉండదు అంటూ ఈయన చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఇచ్చిన మాట తప్పారని తెలుస్తుంది.గత నాలుగు సంవత్సరాలలో ఇప్పటివరకు కరెంట్ బిల్లు తగ్గకపోను ఏకంగా ఏడుసార్లు పెరగడంతో ఇది సామాన్యులకు భారంగా మారింది.

ఇలా ఇప్పటికే ఏడుసార్లు కరెంటు బిల్లులు పెంచి సామాన్యులకు భారంగా మారగా ఇప్పుడు మరోసారి సామాన్య ప్రజలపై కరెంటు బిల్లు మోత మోగనుంది. ఇప్పుడు ట్రూ అప్ పేరుతో ప్రతీ నెలా బాదేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. మేరకు ఏపీఈఆర్‌సీ నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ఈ ట్రూ అప్ పేరుతో ప్రతి యూనిట్ కి 40 పైసలు అధికంగా పడునున్న నేపథ్యంలో సామాన్యులకు ఇది భారంగా మారుతుంది.

 

ఈ ట్రూ అప్ చార్జీలు బయట నుంచి కరెంట్ కొనుగోలు చేయడం వల్ల పడిన భారానికి వసూలు చేసే చార్జీలు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ ఒప్పందాలు రద్దుచేసి వారి దగ్గర నుంచి విద్యుత్తు కొనుగోలు చేయడం మానేయడమే కాకుండా ఒప్పందం ప్రకారం వారికి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే విద్యుత్ చార్జీలపై అధిక భారం వేయనున్నట్లు తెలుస్తోంది.

 

ఇలా ప్రతినెలా విద్యుత్ చార్జీలపై అదనపు భారం పడుతూ ఉండడంతో సామాన్యులకు ఇది ఎంతో కష్టతరంగా మారింది.ప్రస్తుతం వేసవికాలం మొదలవడంతో ఇప్పటికే కరెంటు చార్జీలు అధికంగా వస్తున్న తరుణంలో ఇకపై యూనిట్ కి 40 పైసలు చొప్పున పెంచడంతో ఇది అదనపు భారం అవుతుందని సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.ఇలా కేవలం కరెంటు చార్జీలు మాత్రమే కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఆంధ్రప్రదేశ్ లోనే అధికంగా ఉన్నాయంటూ కొందరు తెలియజేస్తున్నారు. ఇలా కరెంటు చార్జీలు పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యులకు పెను భారంగా మారిపోయాయి.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -