Rakul Preet Singh: బాయ్ ఫ్రెండ్ ఫోటోలు షేర్ చేసిన హాట్ బ్యూటీ

Rakul Preet Singh: సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీల జీవితాలపైనే కాకుండా వారిపై రూమర్స్ వార్తలు కూడా వైరల్ అవుతుంటాయి. సినీ పరిశ్రమలో పుకార్లు అనేవి ఎప్పుడూ షికార్లు చేస్తూనే ఉంటాయి. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమా విజయవంతం అవ్వడంతో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్లారు.

 

సెలబ్రిటీల్లో చూస్తే అందమైన జంటల్లో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానిలు కూడా ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో వీరిని లవ్ బర్డ్స్ అని చాలా మంది అంటూ ఉంటారు. టాలీవుడ్ లో కూడా వీరి జంటపై రూమర్స్ ఉన్నాయి. అందమైన ఫిజిక్ ఉండే రకుల్ ఈ మధ్య వరుస సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం రావడం లేదు. అయితే తాజాగా ఆమె వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ హాట్ బ్యూటీ మ్యారేజ్ రూమర్స్ సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో రకుల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లుగా నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అవునని కానీ, కాదని కానీ రకుల్ ఎక్కడ తన లవ్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. రీసెంట్ గా క్రిస్మస్ సందర్భంగా తన అభిమానులకు రకుల్ ఓ గుడ్ న్యూస్ చెప్పేశారు.

 

2022 డిసెంబర్ 26న రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో జాకీతో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. క్రిస్మస్ వేడుకలని జాకీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నానని, శాంటా తనకు అద్భుతమైన బహుమతిని ఇచ్చాడని రకుల్ తెలిపింది. క్రిస్మస్ వేడుకల ఫోటోలని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వాటిని చూసి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -