Shekhar Master: కూతురి కోసం యంగ్ హీరోని రంగంలోకి దింపనున్న శేఖర్ మాస్టర్!

Shekhar Master: శేఖర్ మాస్టర్ పరిచయం అవసరం లేని పేరు. కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఎంతో మంచి ఆదరణ పొందారు.ఇకపోతే ఈయన కొరియోగ్రఫీ చేసిన పాటలు ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ కావడంతో ప్రతి ఒక్క సినిమాలోని తప్పనిసరిగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.

ఈ విధంగా వరుస సినిమాలు,బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈయన పిల్లలు విన్ని, సాహితీ గురించి కూడా పరిచయం అవసరం లేదు. ఈ పిల్లలు ఇప్పటికే ఎన్నో స్టేజి షోలలో తమ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఇక విన్నీ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు.

సాహితీ సైతం తన డాన్స్ తో నెటిజన్లను ఫిదా చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇలా నిత్యం యూట్యూబ్ వీడియోలు ఇంస్టాగ్రామ్ రిల్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సాహితీ త్వరలోనే వెండితెర హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. చూడటానికి కుందనపు బొమ్మలా ఉండే సాహితీను హీరోయిన్ గా పరిచయం చేయడం కోసం ఓ కొత్త డైరెక్టర్ అద్భుతమైన కథను సిద్ధం చేశారని ఇప్పటికే ఆ కథ శేఖర్ మాస్టర్ కి వినిపించగా కథ నచ్చడంతో తనని హీరోయిన్ గా పరిచయం చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తునట్లు తెలుస్తోంది.

ఇకపోతే సాహితి ఏ హీరో సరసన నటిస్తుందనే విషయానికి వస్తే శేఖర్ మాస్టర్ తనకు ఉన్న క్రేజ్ ఉపయోగించుకొని ఆదర్శకుడి చేత పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలకు కథను వినిపిస్తున్నారట. ఈ క్రమంలోనే తన కూతురిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్నటువంటి యంగ్ హీరో అయితే బాగుంటుందని ఆలోచనలో శేఖర్ మాస్టర్ ఉన్నట్లు సమాచారం. మరి ఈ సినిమాకి ఏ యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -