Prabhas: ప్రభాస్ గొప్పదనం ఇదే.. ఇతర హీరోలకు చేత కాదా?

Prabhas: హీరో ప్రభాస్ రాజు అంటే తెలుగింట మగువలకు ప్రత్యేక అభిమానం. ఇంకా చెప్పాలంటే అమ్మాయిల కలల రారాజు ప్రభాస్. ఇక తను పోషించిన హీరో పాత్రలు, నటన ఎంతో ప్రత్యేకం. అవే తనకంటూ ప్రత్యేక అభిమాన గణాన్ని తెచ్చిపెట్టాయి. ప్రభాస్ అంటే చచ్చి పడిపోయే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. పాపం ఈ మధ్యే కృష్ణం రాజు గారిని కోల్పోయిన బాధ ప్రభాస్ గారిని పట్టి వేధిస్తోంది.

వ్యక్తిగత జీవితంలో ప్రభాస్ గారు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. తన కంటే చిన్నవారిని ఆదరిస్తాడు.. పెద్దవారిని గౌరవిస్తాడు ప్రభాస్. ఈ విషయం ఎన్నో సార్లు నిరూపితమ అయ్యింది. అందుకే ప్రభాస్ ఇతరుల కంటే చాలా ప్రత్యేకం అని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు కూడా. మహోన్నత వ్యక్తిత్వమే ప్రభాస్ గారి విజయరహస్యమని దగ్గరి వారు చెబుతూ ఉంటారు. బహుశా ప్రభాస్ గారిని గమనిస్తే అదే నిజం అనిపిస్తుంది.

ప్రస్తుతం ప్రభాస్ గారికి సంబంధించిన ఒక విషయం వైరల్ గా మారింది. అప్పట్లో ప్రభాస్ నటన తరగతుల్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నప్పుడు ఇతర నటులతో కలిసి ఉండేవారు. గురువు సత్యానందం గారి ప్రియా శిష్యుడు ప్రభాస్. అయితే సత్యానందం గారి దగ్గర జబర్దస్త్ అప్పారావు కూడా ప్రభాస్ గారితో కలిసి శిక్షణ పొందారు. అప్పటి నుండి అప్పారావు గారిని స్థాయి బేధం చూపకుండా గౌరవించేవారు ప్రభాస్.

ఒకానొక సమయంలో బిల్లా సినిమా షూటింగ్ లో అప్పారావు కనిపించగా అతనికి కుర్చీ తెప్పించి వేయించి, తను కూర్చున్న తర్వాత ప్రభాస్ గారు కుర్చున్నారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అప్పారావు గారు ఈ విషయాలు పంచుకోగా.. నెట్టింట్లో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది, ప్రభాస్ నిజంగా దేవుడే అంటూ ఒకరు.. ప్రభాస్ ఎక్కడున్నా రాజే అంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. ఇతర హీరోలకు చేతగాని పని ఇది కేవలం మా ప్రభాస్ కే సాధ్యం అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -