Ajwain: రోజూ వామును అందులో కలిసి తాగితే ఫిట్‌గా ఉంటారట!

Ajwain: ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. శరీరంలో పెరుగుతున్న ఊబకాయం కారణంగా అనేక వ్యాధులు చుట్టుముడుతాయని దీంతో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శరీరాన్ని ఫిట్‌ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో చాలా సార్లు ప్రజలు బరువు తగ్గడానికి ప్రత్యేక ఆహారం తీసుకోవడంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటారు. కానీ బరువు మాత్రం తగ్గదు. ఇలా మీరు కూడా బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే ఆహారంలో వామును ఉపయోగించవచ్చని పేర్కొంటున్నారు.

 

ప్రతిరోజూ వామును తీసుకుంటే జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుందని చెబుతున్నారు. వాము గింజలను వాడితే అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌ను సులువుగా తగ్గించుకోవచ్చు. వాము తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ సులభంగా బయటకు వస్తాయి. శరీర జీవక్రియ కూడా వేగవంతం అవుతుంది. వాము నీరు తయారు చేయడానికి అర టీస్పూన్‌ వాము గింజలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని ఉదయాన్నే వడగట్టి తాగితే పొట్ట కూడా తగ్గుతుంది.

 

వాము టీ తాగడం ద్వారా బరువు తగ్గడంతో పాటు పొట్ట కొవ్వు కూడా కరిగిపోతుంది.వాము టీ తీసుకోవడానికి ఒక గిన్నెలో సగం గ్లాసు నీరు తీసుకోండి.. దానిలో అర టీస్పూన్‌ వాము వేయండి. ఆ తర్వాత 2–3 నిమిషాలు వేడి చేసి ఈ నీటిని ఫిల్టర్‌ చేసి తాగాలి. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థను బలపడుతుంది. బరువు తగ్గడానికి వామును నమిలి అర గ్లాసు నీటిని తాగాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -