Tamannaah: దుర్గ మాత మండపం దగ్గర డాన్స్ చేసిన తమన్నా?

Tamannaah: టాలీవుడ్ ప్రేక్షకులకు మిల్క్ బ్యూటీ తమన్నా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్ముడు.. ఆ తర్వాత వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అనంతరం పలువురు స్టార్ హీరోల సరసన నటించి నటిగా తనకంటూ ఓ సంపాదించుకుంది.

ఇక తమన్నా తన అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా తమన్నాకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. నార్మల్ పీపుల్స్ నుంచి సెలబ్రేటీల వరకు అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తున్నారు. ఇక ఉత్తర భారతదేశంలో నవరాత్రుల సందర్భంగా గార్బా డాన్స్ చేయడం ఆనవాయితీ.

ఇక సోమవారం ముంబైలో ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపానికి తమన్నా వెళ్లారు. అక్కడ దేవి పూజ అయిపోయిన తర్వాత గార్బా డాన్స్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అభిమానులతో కలిసి చిందులు వేశారు. ఎంతో సంతోషంగా వారితో నవ్వుతూ డాన్స్ చేశారు తమన్నా. ప్రస్తుతం తమన్నాకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమన్నాపై ఒక రేంజ్ లో ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

ఇక తమన్నా సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. నెటిజన్లకు తన అందాల విందును వడ్డిస్తుంది. తాజాగా ఈమె బబ్లీ బౌన్సర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈమె గుర్తుందా శీతకాలం, బోళా శంకర్, దట్ ఈజ్ మహాలక్ష్మి అనే సినిమాలో నటిస్తున్నారు. మరి ఈ సినిమాలతో తమన్నా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతం తమన్నా డాన్స్ చేస్తున్న వీడియో మాత్రం సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి...
- Advertisement -
- Advertisement -