Tamanna: తమన్నా ఆ పార్ట్ సూపర్.. సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

Tamanna: టాలీవుడ్ లో అందాలకు కొదవ ఉండదు. తెలుగు ప్రేక్షకులు ఎంతో మంది హీరోయిన్లు ఆదరించారు. ఈ క్రమంలో గత రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అందం తమన్నాది. తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి తెలుగులోకి అడుగుపెట్టిన తమన్నాకు తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు లభించింది.

 

తెలుగులో టాప్ హీరోలు అందరితోనూ జతకట్టిన తమన్నా.. యంగ్ హీరోలతో కలిసి స్టెప్పులతో ఇరగదీసింది. మిల్కీ బ్యూటీగా ఎంతో పాపులర్ అయిన తమన్నా అందానికి తెలుగు ప్రేక్షకులు బాగా ఫిదా అయ్యారు. ప్రస్తుతం తెలుగులో పెద్ద ప్రాజెక్టులు ఏమీ చేయకపోయినా.. ప్రేక్షకులకు ఏదో ఒక రూపంలో తమన్నా టచ్ లోనే ఉంది.

 

తమన్నా అందం గురించి, ఆమె నడుము గురించి తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు తెర మీద తన అందంతో అందరినీ ఊపేసిన ఒకప్పటి ఐటమ్ సాంగ్ హీరోయిన్ జయమాలిన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు సీనియర్ హీరోల సినిమాలకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన జయమాలిన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

 

తన భర్తకు ఈ తరం హీరోయిన్లలో తమన్నా అంటే ఎక్కువ ఇష్టం అని, ఆ తర్వాత కాజల్ అంటే బాగా ఇష్టపడతారని జయమాలిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తమన్నా అందానికి ఆయన ఫిదా అవుతారని.. మరీ ముఖ్యంగా తమన్నా నడుము అంటే పడి చస్తాడని జయమాలిని తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో తమన్నా అందం గురించి మరోసారి చర్చ మొదలైనట్లైంది.

 

ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడలతో పాటు హిందీతో సహా పలు భాషల్లో సినిమాలు చేస్తున్న తమన్నా. 1989లో ముంబైలో జన్మించింది. సింధీ కుటుంబానికి చెందిన తమన్నా 2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే హిందీ సినిమాలో తొలిసారి నటించారు. ఆ తర్వాత మంచు మనోజ్ తో కలిసి ‘శ్రీ’ సినిమాలో మెరిసింది. తెలుగులో బాహుబలితో పాటు బెంగాల్ టైగర్, అబినేత్రి, నా నువ్వే లాంటి సినిమాల్లో నటించింది.

 

తమన్నా తన నటనకు గాను దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డులను 2007, 2009, 2010, 2011, 2012లో అందుకుంది. అలాగే 2007, 2011 మరియు 2012లలో సిని‘మా’ ఆవార్డులను కూడా అందుకుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -