Tamannaah-Rashmika: తమన్నా పరువు తీసేసిన రష్మిక.. అసలేమైందంటే?

Tamannaah-Rashmika: పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సాధించింది రష్మిక. వరుసగా పెద్ద సినిమాల్లో ఛాన్స్ కొట్టేస్తోంది. భారీగా రెమ్యునరేషన్ కూడా పెంచేసింది. ఇప్పుడు అమ్మడి చేతిలో టాలీవుడ్‌లో రెండు, కోలీవుడ్‌లో రెండు, బాలీవుడ్‌లో ఏకంగా ఏడు బడా ప్రాజెక్టులో భాగమైంది రష్మిక. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ హాట్ ఫొటోలతో కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

 

అలాగే అప్పుడప్పుడూ అభిమానులతో సోషల్‌మీడియాలో రష్మిక చిట్ చాట్ చేస్తూ కొన్ని కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. తద్వారా ట్రోల్స్‌కు గురవుతూ ఉంటుంది. తాజాగా హీరోయిన్ తమన్నాపై పరోక్షంగా తమన్నా చీప్ కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

 

డబ్బుల కోసం ఎలాంటి రోల్స్‌ అయినా చేస్తారా?
‘కెరీర్ బాగున్నప్పుడు అలా ఐటెం సాంగ్స్‌లో ఎలా నటిస్తారు? తర్వాత అవకాశాలు ఎలా దక్కుతాయని అనుకుంటారు..? కెరీర్‌లో మనం వేసే ప్రతి స్టెప్ ఆచితూచి వేయాలి. అప్పుడే మన కెరీర్ టాప్ పొజిషన్‌లో ఉంటుంది. అవకాశాలు లేవు కదా అని డబ్బుల కోసం ఎలాంటి రోల్స్‌కైనా ఓకే చేయడం ఇండస్ట్రీలో హీరోయిన్స్ చేస్తున్న బిగ్గెస్ట్ మైనస్ పాయింట్’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు తమన్నాను ఉద్దేశించి అంటూ జనాలు రష్మికను ట్రోల్ చేస్తున్నారు. తమన్నా ఇటీవల అనేక సినిమాల్లో ఐటమ్స్ సాంగ్స్ చేస్తోంది. దీంతో ఆమెనే రష్మిక టార్గెట్ చేసిందని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

 

కాగా, ఇటీవల సోషల్‌ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నారంటూ రష్మిక ఎమోషనల్ పోస్టు చేసిన విషయం తెలిసిందే. తనపై రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఆవేదన కలిగిస్తోందని తెలిపింది. తనపై ట్రోలింగ్ ఆపివేయాలని ఆమె కోరింది. ప్రస్తుతం ప్రేక్షకులను అలరించేందుకు తాను ఎంతగానో కష్టపడుతున్నట్టు పేర్కొంది. అలాంటి తనపై కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, అది తన హృదయాన్ని గాయపరుస్తోందని ఆమె అన్నారు. గత కొన్ని రోజులుగా తన మనసును కొన్ని విషయాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం వాటిని పరిష్కరించే సమయం వచ్చిందని భావిస్తున్నట్టు చెప్పింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -