Tamannaah: రొమాంటిక్ సీన్స్ పై తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!

Tamannaah: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న హీరోయిన్ల జాబితాలో తమన్నా కూడా ఒకరు. తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పుడు తెలుగు, తమిళంతో పాటు హిందీ లాంటి పలు భాషల్లో సినిమాలతో పాటు పలు షోలు, కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటోంది. తెలుగులోని టాప్ హీరోలు అందరితో నటించిన తమన్నా.. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తోంది.

తెలుగులో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించిన తమన్నా.. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో కలిసి నటించింది. అయితే ఈ అమ్మడు తాజాగా తెలుగు హీరోలు రొమాంటిక్ సీన్లను చేయడానికి ఏం చేస్తారనే విషయాన్ని వెల్లడించడం ఇండస్ట్రీలో చాలా ఆసక్తిని, చర్చను రేపుతోంది. బాలీవుడ్ లో బిజీగా ఉంటున్న ఈ భామ తెలుగు సినిమా షూటింగ్ ల సమయంలో హీరోలు ఎలా ఇబ్బందిపడతారనే విషయాన్ని వెల్లడించింది.

రొమాంటిక్ సీన్లు చేయడం విషయంలో తాను ప్రారంభంలో చాలా ఇబ్బందిపడినట్లు హీరోయిన్ తమన్నా తన వ్యక్తిగత విషయాన్ని పంచుకుంది. కానీ ఇది కేవలం సినిమా షూటింగ్ అనే విషయాన్ని గుర్తు చేసుకొని.. తనకు తాను సర్దిచెప్పుకొని రొమాంటిక్ సీన్లు చేస్తున్నట్లు ఆమె వివరించింది. ముందు కాస్త ఇబ్బందిపడినా ఇప్పుడు మాత్రం తనకు ఎలాంటి ఇబ్బంది, మొహమాటం లేవని చెబుతోంది.

ఇక తెలుగు సినిమా హీరోల్లో చాలామంది మొహమాటపడతారని తమన్నా వివరించింది. అందరి ముందు రొమాంటిక్ సీన్లు చేయడానికి హీరోలు చాలా సిగ్గు పడతారని.. కొంతమంది హీరోలు అయితే సెట్ లో ఎక్కువ మంది ఉండకుండా చూసుకుంటారని చెప్పింది. మూడ్ రావడానికి సీన్ లోని నటులు, కెమెరామ్యాన్, డైరెక్టర్ మాత్రమే ఉండాలని కొంతమంది హీరోలు అడుగుతారని తమన్నా తెలిపింది. ఈ మొహమాటం తెలుగు హీరోలకు ఎక్కువ అని, బాలీవుడ్ లో మాత్రం ఇలాంటి మొహమాటం తాను చూడలేదని తమన్నా పేర్కొంది. కాగా తమన్నా కామెంట్లు విన్న జనాలు మాత్రం అమ్మడు మాంచి ముదురు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

TDP: ఆ 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్న టీడీపీ.. మార్పుతో గెలుపు ఖాయమా?

TDP: మే 13వ తేదీ ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అలాగే...
- Advertisement -
- Advertisement -