Tammreddy Bharadwaja: వైరల్ అవుతున్న తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు!

Tammreddy Bharadwaja: తమ్మారెడ్డి భరద్వాజ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారికి ఈయన బాగా సుపరిచితమే. ఇండస్ట్రీలో అలాగే సమాజంలో ఎటువంటి విషయాలు జరిగినా కూడా వెంటనే ఆ పరిణామాలపై స్పందిస్తూ కుండ బద్దలు కొట్టినట్టుగా ముక్కుసూటితనంగా మాట్లాడుతూ ఉంటారు తమ్మారెడ్డి భరద్వాజ. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఆయన తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా కంటే కాంట్రవర్సీల ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారని చెప్పవచ్చు. సెలబ్రిటీలపై కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా మాట్లాడుతూ తరచూ వార్తలు నిలుస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చలకు దారితీసాయి. పవన్ ఫ్యాన్స్ ఆయన టార్గెట్ చేసి బాగా ట్రోల్స్ చేయడం వంటివి చేశారు. ఈ సందర్భంగా అత్తమ్మ రెడ్డి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీతో కలిసి తిరగాలని భావిస్తున్నాడు. జనసేన సైనికులు మాత్రం ఆయనకి ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉందని అంటున్నారు. మరి పవన్ తన అనుచరులతో మాటలనే విభేదిస్తున్నట్లు భావించాలా అని ఆయన నిలదీశారు. పవన్ మాటల గురించి వివరణ ఇస్తూ పవన్ కళ్యాణ్ తన భార్యతో ఇంట్లో మాట్లాడిన మాటలకు నేను దూరి విమర్శించలేదు.

కేవలం ఆయన రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడాను. నాకు ఆ హక్కు ఉంది. నాకే కాదు ఎవరికైన ఉంటుంది. స్థాయిల గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడుతున్నారు. ఇండియాలో అందరి స్థాయి ఒకటే. ప్రధాని అయినా కామన్ మ్యాన్ అయిన ఇద్దరు ఒకటే స్థాయి ఉంటుంది అని చెప్పుకొచ్చారు భరద్వాజ. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఆయన మాట్లాడారు ఆయన పేరు చెప్పుకునే కొంతమంది జనసేన సైనికులు మాట్లాడతారు. దానివల్ల నాకేం నష్టం జరగదు ఇంకా నా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. పవన్ కళ్యాణ్ చక్కగా ఉంటే ఆయన అభిమానులు కూడా చక్కగా ఉంటారు అంతే షాకింగ్ కామెంట్స్ చేశారు తమ్మారెడ్డి భరద్వాజ..

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -