Tarak: తారక్‌ను బెల్టుతో కొట్టిన వ్యక్తి ఎవరో తెలుసా?

Tarak: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తల్లి షాలిని గురించిన వివరాలు పెద్దగా బయటకు రావు. ఆమె నందమూరి హరికృష్ణకు రెండో భార్యగా మాత్రమే ప్రజలకు తెలుసు. అయితే షాలిని హరికృష్ణ లైఫ్‌లో ఎలా వచ్చిందనే విషయం ఎవరికీ తెలియదు. నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు తెలిసినా కాసింత ఆసక్తికరంగానే ఉంటాయి. వాస్తవానికి షాలినిది కర్ణాటకలోని విద్వాంసుల కుటుంబం. ఆమెకు శాస్త్రీయ సంగీతం మెండుగా వచ్చు. అయితే సీనియర్ ఎన్టీఆర్ తన మనవళ్లు, మనవరాళ్లకు సంగీతం నేర్పించాలనుకున్నాడు. షాలిని సంగీతం టీచర్‌గా ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎంట్రీ ఇచ్చింది. అయితే అప్పుడే హరికృష్ణతో పరిచయమైంది. షాలిని ప్రతిరోజు డ్యూటీ ముగించుకున్న తర్వాత హరికృష్ణే ఆమెను కారులో ఇంటికి దిగబెట్టేవారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

 

 

హరికృష్ణకు రెండో భార్య అయినప్పటికీ ఏ రోజూ తన పరిధిని దాటి ప్రవర్తించలేదు. ఎన్టీఆర్ కుటుంబంలో ఎంతో అణుకువతో ఉంది. హరికృష్ణ-షాలిని దంపతులకు జూనియర్ ఎన్టీఆర్ పుట్టారు. వాస్తవానికి షాలిని ఎప్పుడూ ఎక్కువగా బయట కనిపించరు. కొడుకు ఎన్టీఆర్‌తోనే కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వార్త వైరల్ అయింది. చిన్నప్పుడు ఎన్టీఆర్ ఒక అల్లరి పిడుగు. రోజూ అల్లరి చేస్తూ తెగ సతాయించేవాడట. అప్పుడు ఒకసారి తల్లి షాలిని.. ఎన్టీఆర్‌ను బెల్టుతో కొట్టింది. అప్పుడు ఎన్టీఆర్ ఎంతో ఏడవడం మొదలు పెట్టాడు. షాలిని కూడా తన కొడుకు కొట్టి తప్పు చేశానని బాధపడింది. ఆ తర్వాత షాలిని మళ్లీ ఎన్టీఆర్‌ను కొట్టేలేదట. కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ కొమరంభీమ్ పాత్రలో నటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. పాన్ ఇండియా స్టార్‌గా అవతారమెత్తాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -