Tarak: చలపతిరావు మృతిపై తారక్ ఎమోషనల్ ట్వీట్.. ఏమైందంటే?

Tarak: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. 1200కు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు చలపతిరావు నేడు కన్నుమూశారు. ఆదివారం ఉదయం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, ప‌లువురు రాజ‌కీయ‌ నాయకులు సంతాపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. చ‌ల‌ప‌తిరావు సినిమాలోనూ జీవితంలోనూ చాలా సర‌దాగా ఉంటారు. త‌న చుట్టూ ఉన్న వారిపై ఛ‌లోక్తులు కూడా విసురుతుండటం ఆయన నైజం అని చెప్పాలి. కానీ ఆయ‌న్ని ద‌గ్గ‌ర‌గా చూసిన వారు మాత్రం ఎప్పుడూ న‌వ్వుతుండే ఆయ‌న చిరునవ్వు వెనుక ఎన్నో విషాదాలు ఉన్నాయని చెబుతుంటారు.

మ‌న‌సులో ఎంత బాధ ఉన్నా కూడా ఆయన అది బయటకు తెలియనివ్వడు. మొహంలో చిరునవ్వును చిందిస్తూనే ఉంటాడు. చలపతి రావు స‌తీమ‌ణి పేరు ఇందుమతి కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. గతంలో చెన్నైలో ఉన్న కాలంలో ఇందుమ‌తి చీర‌కు నిప్పు అంటుకోవడంతో ఆమె మరణించారు. ఆ త‌ర్వాత కుటుంబీకులు, స్నేహితులు ఎంత చెప్పినా చలపతి రావు మరో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు.
ఆయన కుమారుడు ర‌విబాబు న‌టుడు, డైరెక్ట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కుమార్తెలు ఇద్ద‌రు అమెరికాలో స్థిరపడి జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే చలపతి రావు నటించిన తొలి సినిమా గూఢచారి 116 కావడం విశేషం. ఆ తర్వాత నటుడిగా, విలన్ కొడుకుగా, హీరో సహాయకుడిగా, సైడ్ విలన్‌గా, మెయిన్ విలన్‌గా చాలా సినిమాల్లో కనిపించారు. నిర్మాతగా మారి ఆయన ఏడు సినిమాలను తెరకెక్కించారు. చలపతి రావు నటించిన చివరి చిత్రం బంగార్రాజు కావడం విశేషం.

చలపతి రావు మరణవార్త విని సినీ లోకం కన్నీటిపర్యంతమైంది. అందులోనూ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు చలపతి రావుకు మంచి సంబంధాలున్నాయి. వీరిద్దరూ గతంలో ఆది సినిమాలో బాబాయ్, అబ్బాయిలుగా కనిపించారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ తారక్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. లే బాబాయ్..లే అంటూ తారక్ ట్వీట్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది .

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -