Tarak: తారక్ గురించి రాజమౌళి మాటలు వింటే దండం పెట్టాల్సిందే!

Tarak: టాలీవుడ్ దర్శక ధీరుడు “రాజమౌళి” తీసిన ప్రతి చిత్రం అద్భుతమే. ఇక రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ ఓ రేంజ్ లో హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. వేర్వేరు రంగాల్లో రాటుదేలిన ఇద్దరు అత్యంత ప్రతిభావంతులు సినిమా తీస్తే అది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఇక తారక్ – జక్కన్న కాంబినేషన్ కూడా అలాంటి ఒక ప్రత్యేకత కలిగినదే.

 

యంగ్ టైగర్ సామర్థ్యం అనన్య సామాన్యం.
ఇక ఇటీవల రాజమౌళి ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. యంగ్ టైగర్ పుట్టుకతోనే నటుడు, అతని గ్రాస్పింగ్ పవర్ ఊహించని స్థాయిలో ఉంటుంది అని రాజమౌళి తెలిపారు. దర్శకత్వ సమయంలో తారక్ తో దర్శకునికి మంచి అనుభవం ఉంటుందని ఈ దర్శక ధీరుడు చెప్పుకొచ్చారు. దానితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కేవలం నటుడు కాదు.. “యాక్టింగ్ ట్రాన్స్ ఫార్మర్” అనడంతో, అభిమానులుపండుగ చేసుకుంటున్నారు.

ఇక టాలీవుడ్ చిత్ర సీమలో ఎంతమంది హీరోలు ఉన్నా తారక్ – జక్కన్న మధ్య బంధం చాలా ప్రత్యేకమైనదని పలువురు అంటున్నారు. ఇటీవల చాలామంది హీరోలతో సినిమాలు తీసి వారిని పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చిపెట్టారు జక్కన్న. అయితే నెక్స్ట్ సూపర్ స్టార్ తో రాజమౌళి ఓ సినిమా తీయనున్నారు. ఇక ఈ సినిమా ద్వారా మహేష్ బాబు కూడా పాన్ ఇండియా హిట్ ను పొందాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. ఈ సినిమా కోసం 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో కేటాయించనున్నట్టు టాక్ నడుస్తోంది. మహేష్ – రాజమౌళి సినిమా పూర్తి వివరాలు త్వరలో తెలిసే ఛాన్స్ ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -