NTR: తారక్ వేరే లెవెల్ అంట. బాలీవుడ్ లో కూడా మారుమ్రోగుతోందా?

NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ద్వారా ఈయన గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ సినిమా ద్వారా ఈయనకు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ లభించింది.

 

ఇకపోతే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ నెల 23న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోనుంది. ఇక ఈ సినిమా ద్వారా దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు.

ఇలా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానులు మాత్రమే కాకుండా తాను కూడా ఎన్టీఆర్ సినిమాలో భాగం కావాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఈ విషయం గురించి తరచూ కొరటాల శివ గారికి మెసేజ్ కూడా చేస్తున్నానని జాన్వీ కపూర్ ఓ సందర్భంలో ఎన్టీఆర్ సినిమా గురించి వెల్లడించారు.

 

ఎన్టీఆర్ గారితో నటించాలనేది తనకు ఎప్పటినుంచో ఉన్న కల ఇలా ఈయనతో నటించే అవకాశం రావాలని ప్రతి రోజు దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నానని అయితే ఆకల నెరవేరిందని ఈమె తెలియజేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో కలిసి ఎప్పుడు షూటింగ్లో పాల్గొంటానా అని తాను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఇక ఎన్టీఆర్ నటించిన RRR సినిమాని తాను మరోసారి చూసానని, అందులో ఆయన నటన అందం మరో లెవెల్ అంటూ కామెంట్ చేశారు. ఆయన నటనను అందుకోవాలి అంటే బాగా కష్టపడాల్సి ఉంటుందని ఈ సందర్భంగా జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -