Tarak: అన్న కుటుంబంను ఆదుకుంటున్న తారక్.. కోటికొక్కడంటూ?

Tarak: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో జూనియర్ ఎన్టీఆర్. నటనలోనూ, డ్యాన్స్ లోనూ ఏ హీరో అందుకోలేని పర్ఫామెన్స్ ఎన్టీఆర్ నుండి వస్తుంది. డైలాగ్ డెలివరీలో నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తున్న యంగ్ టైగర్.. ‘ఆర్ఆర్ఆర్’లో ‘కొమురం భీముడో’ పాటకు చేసిన యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. అతడికి ఆస్కార్ అవార్డ్ ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపించడం తెలిసిందే.

 

సినిమాలకు రాకముందు ఎంతో కష్టపడ్డ యంగ్ టైగర్.. ఎంతో ప్రేమతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను రంజింపజేస్తున్నాడు. ఎన్టీఆర్ వ్యక్తిగతం పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని ఇండస్ట్రీలో టాక్. కేవలం తన తల్లి, భార్యాబిడ్డల వరకే కాకుండా తన అనుకునే వారందరినీ తారక్ ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. తాజాగా తారక్ తనకు అన్న వరుస అయ్యే వ్యక్తికి చేస్తున్న సాయం గురించి తెలుసుకుంటున్న అభిమానులు.. ఎన్టీఆర్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

 

నందమూరి కుటుంబానికే చెందిన సదరు వ్యక్తి, యంగ్ టైగర్ కు అన్న అవగా.. అతడికి ఎన్టీఆర్ అండగా నిలుస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ తనకు అన్న వరుస అయ్యే వ్యక్తి కోసం నెలకు రూ.5లక్షలు సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు బాగా బ్రతికిన సదరు వ్యక్తి ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉన్న నేపథ్యంలో తారక్ అతడికి అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.

 

కన్న తల్లిదండ్రులనే చూడని కొడుకులు, కూతుళ్లు ఉన్న ఈ సమాజంలో.. తారక్ లాంటి వ్యక్తులు చాలా అరుదు అని అందరూ కొనియాడుతున్నారు. వరుసకు అన్న అయ్యే వ్యక్తికి నెలకు ఏకంగా రూ.5లక్షల వరకు సాయంగా నిలవడం అనేది చాలా పెద్ద విషయం అని, అది ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైందని యంగ్ టైగర్ అభిమానులు గర్వంగా చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts