Tarak: తారక్ తో అనుష్క సినిమా చేయకపోవడానికి రీజన్ ఇదేనా?

Tarak: తెలుగు తెరపై హీరోయిన్ అనుష్క కనపడి చాలా రోజులైంది. గతంలో అనుష్క సినిమా వస్తే చాలు చాలా మంది ఎదురుచూసేవారు. స్వీటీ అని ముద్దుగా పిలుచుకుంటూ ఆమె పాటలు పాడుకునేవారు. ఆమె డైలాగులతో రచ్చ చేసేవారు. అయితే బాహుబలి సినిమా తర్వాత అనుష్క పెద్ద సినిమాలేమీ చేయడం లేదు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

అనుష్క పెద్ద హీరోల సరసన మెరిసింది. కుర్ర హీరోలతో కూడా స్క్రీన్ ను షేర్ చేసుకుంది. కానీ ఇప్పటి వరకూ జూనియర్ ఎన్టీఆర్, అనుష్క కాంబోలో ఏ సినిమా రాలేదు. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకూ కూడా ఫుల్ లెంగ్త్ రోల్స్ తో సినిమా తెరకెక్కలేదని చెప్పొచ్చు. అయితే చింతకాయల రవి సినిమాలో వెంకీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ తో అనుష్క ఓ పాటకు స్టెప్పులేసింది.

 

దర్శకుడు గుణశేఖర్ ఈ ముద్దుగుమ్మతో రుద్రమదేవి అనే సినిమా చేశారు. అందులో మొదట ఎన్టీఆర్ హీరోగా నటించాల్సి ఉంది. అయితే పలు కారణాల చేత ఆ సినిమాలో తారక్ నటించలేకపోయాడు. రుద్రమదేవిలో గోన గన్నా రెడ్డి క్యారెక్టర్ చేేయడానికి మొదట దర్శకుడు గుణశేఖర్ జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబులను సంప్రదించారట. అయితే ఆ క్యారెక్టర్ సినిమాలో తక్కువ సేపే ఉండటంతో తారక్, మహేష్ నటించడానికి ఆసక్తి చూపలేదట.

 

గోనగన్నారెడ్డి పాత్రకు బన్నీని సంప్రదిస్తే ఆ క్యారెక్టర్ కి ఒప్పుకున్నట్లు సమాాచారం. ఎన్టీఆర్, అనుష్క కాంబోలో సినిమా రావాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఇద్దరూ కూడా మంచి జోడీగా కనిపిస్తారనేది పక్కనబెడితే వీరు ఇద్దరూ అక్కా తమ్ముడిలా ఉంటారట. ఎన్టీఆర్ కు అనుష్క అక్కలా కనిపిస్తుందని అందుకే వీరి జోడి కలిసి నటించే అవకాశం రాలేదని తెలుస్తోంది. తారక్ కన్నా అనుష్క కాస్త పొడవుగా ఉంటుంది. కొంచెం బొద్దుగా కూడా ఉంటుంది. అందుకే వీరి జోడిని సెట్ చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ తో అనుష్క నటించే అవకాశం రాబోవు రోజుల్లో వస్తుందేమోనని ఎదురుచూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -